ఆరేళ్ళ క్రితమే నయన్-విగ్నేష్ వివాహం..సరోగసి వివాదం కొత్త మలుపు, ఎస్కేప్ ప్లానా ?

First Published Oct 16, 2022, 8:47 AM IST

నయనతార సరోగసి వివాదంగా మారడంతో ప్రభుత్వం ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ వివాదంలో నిజానిజాలు బయటకి తీసేందుకు నియమించిన త్రిసభ్య కమిటీ ఇప్పటికే ఆసుపత్రిని గుర్తించింది.

లేడీ సూపర్ స్టార్ నయనతారకి సమస్యలు ఎక్కువవుతున్నాయి. నయనతార, విగ్నేష్ శివన్ దంపతులు సరోగసి విధానం ద్వారా పిల్లలని పొందారు.  నాలుగు నెలల క్రితం నయనతార, విగ్నేష్ శివన్ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్ళికి ముందు సహజీవనం చేసిన వీరిద్దరూ ఎట్టకేలకు మహాబలిపురంలో జరిగిన వివాహ వేడుకలో దంపతులయ్యారు. 

నయనతార సరోగసి వివాదంగా మారడంతో ప్రభుత్వం ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ వివాదంలో నిజానిజాలు బయటకి తీసేందుకు నియమించిన త్రిసభ్య కమిటీ ఇప్పటికే ఆసుపత్రిని గుర్తించింది. నయనతార సరోగసీపై సహకరించిన ఆసుపత్రి నుంచి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  పరిస్థితులు చూస్తుంటే నయన్, విగ్నేష్ జంటకి ఉచ్చు బిగుసుకునేలా ఉంది. ఇండియాలో సరోగసి విధానానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. కొందరు ఇది బ్యాన్ అని చెబుతున్నారు. ఈ వ్యవహారం పై లోతుగా దర్యాప్తు చేస్తాం అని తమిళనాడు ఆరోగ్య మంత్రి సుబ్రహ్మణ్యన్ ఆల్రెడీ ప్రకటించారు. 

ఒక వేళ ఈ వ్యవహారంలో ప్రభుత్వం నుంచి సమస్యలు ఎదురైతే న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలి అని నయన్, విగ్నేష్ దంపతులు లాయర్లని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఎలా ముందుకు వెళ్ళాలి అని వారి సలహాలు తీసుకుంటున్నారట.  

తాజాగా నయన్ విగ్నేష్ దంపతులు సరోగసి కేసుని ఎదుర్కొనేందుకు కొత్త ప్లాన్ తెరపైకి తెచ్చారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాల్సి ఉంది. రోజురోజుకు ఈ సమస్య ఎక్కువ అవుతుండడంతో ఫుల్ స్టాప్ పెట్టాలని నయన్, విగ్నేష్ నిర్ణయించుకున్నారట. ఆరేళ్ళ క్రితమే తాము వివాహం చేసుకున్నట్లు ప్రభుత్వానికి నయన్, విగ్నేష్ ఆధారాలు సమర్పించినట్లు వార్తలు వస్తున్నాయి. 

సరోగసి విధానం పాటించాలంటే పెళ్లి జరిగి ఐదేళ్లు గడచి ఉండాలి. అలాగే అమ్మాయి వయసు 50 ఏళ్ల లోపు , అబ్బాయి వయస్సు 55 ఏళ్ల లోపు ఉండాలి. దీనితో నయనతార తాము ఆరేళ్ళ క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు అధికారులకు ఆధారాలు చూపించారట. 

ఇటీవల సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నాం అని, కానీ అధికారికంగా తమ వివాహం ఎప్పుడో జరిగిపోయిందని చెబుతున్నట్లు తెలుస్తోంది. మరి నయనతార, విగ్నేష్ సమర్పించిన సాక్ష్యాలతో అధికారులు కన్విన్స్ అవుతారో లేదో చూడాలి. 

తన సోదరుడికి తెలిసిన ఒక మహిళ నయన్, విగ్నేష్ పిల్లలకు సరోగేట్ మదర్ గా వ్యవహరించి జన్మనిచ్చింది. తెర వెనుక నయన్ కి ఆమె సోదరుడు ఈ సరోగసి విధానంలో సహకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె దుబాయ్ లో ఉంటున్న మహిళ కాబట్టి.. అక్కడ సరోగసీపై ఎలాంటి నిబంధనలు లేవు. కాబట్టి నయన్ కి ఈ వివాదం పెద్ద సమస్య కాకపోవచ్చు అని కొందరు అభిప్రాయ పడుతున్నారు.  

click me!