`సింగిల్‌`, `శుభం` మూడు రోజుల కలెక్షన్లు.. శ్రీవిష్ణు, సమంత ఇద్దరిలో ఎవరు టాప్‌?

Published : May 12, 2025, 05:13 PM IST

గత శుక్రవారం విడుదలైన తెలుగు చిత్రాలు శ్రీవిష్ణు `సింగిల్‌`, సమంత నిర్మించిన `శుభం`మూవీ ఫస్ట్ వీకెండ్‌ పూర్తి చేసుకున్నాయి. మరి మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేశాయనేది చూస్తే.   

PREV
15
`సింగిల్‌`, `శుభం` మూడు రోజుల కలెక్షన్లు.. శ్రీవిష్ణు, సమంత  ఇద్దరిలో ఎవరు టాప్‌?
single, sree vishnu, shubham movie

ఈ సమ్మర్‌ పెద్ద సినిమాలు లేకుండానే పూర్తవబోతుంది. కానీ ఇది చిన్న చిత్రాలకు మంచి అవకాశం. చాలా వరకు చిన్న చిన్న సినిమాలే థియేటర్లలో సందడి చేస్తున్నాయి. బాగున్న చిత్రాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. కానీ ఈ సీజన్‌ని చాలా సినిమాలు మిస్‌ చేసుకుంటున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఈ గత శుక్రవారం రెండు ప్రముఖ చిత్రాలు ఆడియెన్స్ ముందుకు వచ్చాయి. శ్రీవిష్ణు హీరోగా నటించిన `సింగిల్‌` మూవీ, సమంత నిర్మాతగా మారి నిర్మించిన `శుభం` మూవీ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ మూవీస్‌ మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేశాయనేది తెలుసుకుందాం. 

25
single movie

కామెడీ చిత్రాలతో అలరిస్తున్న శ్రీవిష్ణు ఇప్పుడు `సింగిల్‌` చిత్రంతో సందడి చేస్తున్నారు. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌ కమెడియన్‌గా అలరించారు. కార్తీక్‌ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొంది మొదటి రోజు నుంచే మంచి ఆదరణ పొందుతుంది. ఈ క్రమంలో కలెక్షన్ల పరంగానూ ఇది సత్తా చాటుతుంది. 
 

35
single movie

`సింగిల్‌` మూవీ మూడు రోజుల్లో మంచి వసూళ్లని రాబట్టింది. సుమారు ఇది రూ. 16కోట్లు వసూలు చేసింది. అంటే దాదాపు ఎనిమిది కోట్ల షేర్‌ సాధించింది. బిజినెస్‌ పరంగా చూస్తే ఈ మూవీ ఆల్మోస్ట్ సేఫ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. సోమవారం నుంచి దక్కే ఆదరణ బట్టి ఈమూవీ సక్సెస్‌ రేంజ్‌ ఆధారపడి ఉంటుంది. మరి ఎంత వరకు వెళ్తుందో చూడాలి. 
 

45
shubham movie

ఇదిలా ఉంటే సమంత నిర్మాతగా మారి `శుభం` చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ప్రవీణ్‌ కంద్రేగుల దర్శకత్వం వహించారు. ఇందులో హర్షిత్‌ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్‌,చణ్‌ పెరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండేపూడి, వంశీ ధర్‌గౌడ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. సీరియల్‌ ప్రధానంగా సాగే ఈ ఫ్యామిలీ ఎంటరటైనర్‌ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. 
 

55
shubham movie

సమంత `శుభం` మూవీ కూడా మంచి వసూళ్లని రాబడుతుంది. మూడు రోజుల్లో ఈ చిత్రం 5.25కోట్లు వసూలు చేసిందట. ఎలాంటి అంచనాలు లేకుండా, చాలా చిన్న మూవీగా, ప్రయోగాత్మకంగా రూపొందిన ఈ చిత్రం ఇంతటి స్థాయిలో వసూళ్లని రాబట్టడం విశేషం. కంటెంట్‌ ఆకట్టుకునేలా ఉండటంతో డీసెంట్‌ రెస్పాన్స్ తో ఆదరణ పొందుతుంది. మండే రోజు నుంచి ఈ మూవీకి ఎలాంటి స్పందన దక్కుతుందో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories