`కాకి ముక్కుకి దొండపండు`.. సునీతపై నెటిజన్‌ వల్గర్‌ కామెంట్‌.. దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన సింగర్‌

Published : Feb 04, 2022, 10:17 PM ISTUpdated : Feb 04, 2022, 10:18 PM IST

సింగర్‌ సునీత..రెండో పెళ్లికి సంబంధించి ఇంకా విమర్శలు ఎదుర్కొంటుంది. ఆమె గతంలోనూ పలు కామెంట్లని చవిచూసింది. ఇప్పుడు మరో నెటిజన్ విరుచుపడ్డాడు. దీనికి సునీత సైతం స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది.   

PREV
16
`కాకి ముక్కుకి దొండపండు`.. సునీతపై నెటిజన్‌ వల్గర్‌ కామెంట్‌.. దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన సింగర్‌

సింగర్‌ సునీత.. ప్రముఖ మ్యూజిక్‌ కంపెనీకి సంబంధించిన డిజిటల్‌ అధినేత రామ్‌ వీరపనేని గతేడాది వివాహం చేసుకుంది. ఈ జనవరిలోనే తమ సెకండ్‌ మ్యారేజ్‌కి సంబంధించి ఏడాది పూర్తి చేసుకున్నారు. ఫస్ట్ వెడ్డింగ్‌ యానివర్సరీ సందర్భంగా ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది సింగర్‌ సునీత. 

26

అయితే ఆమె రెండో పెళ్లికి సంబంధించి మాత్రం తరచూ విమర్శలు, ట్రోల్స్ ఎదుర్కొంటూనే ఉంది. కొందరు నెటిజన్లు, సినిమా రంగానికి చెందిన వాళ్లు కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ టైమ్‌లో పెళ్లి ఎందుకనే కోణంలో కామెంట్లు చేస్తుండట విచారకరం. అయితే సాధ్యమైనంత వరకు సింగర్‌ సునీత కౌంటర్‌ ఇస్తూ వస్తుంది. కొన్నింటిని పట్టించుకోవడం లేదు. కానీ ఇప్పటికీ ఈ కామెంట్లు మాత్రం ఆగడం లేదు. 

36

తాజాగా సింగర్‌ సునీత, రామ్‌ వీరపనేని సమానత్వానికి మారుపేరుగా నూతనంగా ఆవిష్కరించబడుతున్న రామానుజులు విగ్రహాన్ని సందర్శించారు. అక్కడ వీరిద్దరు కలిసి దిగిన ఫోటోని ఫేస్‌ బుక్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది సింగర్‌ సునీత. `స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ` అంటూ కామెంట్‌ పెట్టారు. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. 

46

అయితే ఈ ఫోటోని ఉద్దేశించి ఓ  నెటిజన్ సింగర్ సునీతపై విరుచుపడ్డాడు. వల్గర్‌ కామెంట్‌తో రెచ్చిపోయాడు. `కాకి ముక్కుకి దొండ పండు. సునీతకు ముసలి రామ్‌ మొగుడు. అందం ఆమె సొంతం, ధనము ఆయన సొంతం` అంటూ రెచ్చిపోయాడు. దీంతో దీనిపై సింగర్‌ సునీత స్పందించింది. ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఆ నెటిజన్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. `నోటి దూల నీది. నీ భారం భూమిది` అంటూ తనదైన స్టయిల్‌తో స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. దీంతో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌ అవుతుంది. సోషల్‌ మీడియాలోవైరల్‌ అవుతుంది. 

56

అయితే నెటిజన్లు, అభిమానులు మాత్రం సునీతకి మద్దతుగా నిలిచారు. అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చారని వెల్లడిస్తున్నారు. అంతేకాదు ఇలాంటి దుర్మార్గుల కామెంట్లని పట్టించుకోవద్దని, మీ గాత్రం అద్భుతమని, రోజు రోజుకి మీ గొంతులోని తియ్యదనం పెరుగుతుందని, మరింత అందంగా ఉన్నారని ఆమెకి మద్దతుగా నిలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇలానే అద్భుతమైన పాటలు ఆలపిస్తూ మమ్మల్ని అలరింప చేయాలని కోరుతున్నారు. 
 

66

సింగర్‌ సునీత రెండో పెళ్లి తర్వాత రెట్టింపు ఉత్సాహంతో కెరీర్‌లో ముందుకు సాగుతుంది. ఓ వైపు సింగర్‌గా బిజీగా ఉంటూనే మరోవైపు టీవీ షోస్ లోనూ పాల్గొంటుంది. జడ్జ్ గానూ వ్యవహరిస్తుంది. ఇంకోవైపు పాటల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తీరిక లేకుండా గడుపుతుంది. అదే సమయంలో వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఫ్యామిలీతోనూ గడుపుతుంది. సమయం చిక్కినప్పుడల్లా వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పనులు చేస్తూ రిలాక్స్ అవుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories