నా పెళ్లి వాళ్లకిష్టం లేదు..ఆమె దారుణంగా అవమానించింది: సింగర్‌ సునీత ఎమోషనల్

Published : Aug 10, 2021, 03:53 PM ISTUpdated : Aug 10, 2021, 03:58 PM IST

సింగర్‌ సునీత రెండో పెళ్లి చేసుకున్నప్పుడు పలు నెగటివ్‌ కామెంట్లు వినిపించాయి. కానీ తాజాగా సునీత షాకింగ్‌ విషయాలు వెల్లడించింది. తాను పెళ్లి చేసుకోవడం కొందరికి ఇష్టం లేదని, ఆ తర్వాత మాట్లాడటం మానేశారని తెలిపింది.   

PREV
18
నా పెళ్లి వాళ్లకిష్టం లేదు..ఆమె దారుణంగా అవమానించింది: సింగర్‌ సునీత ఎమోషనల్

సింగర్‌ సునీత.. మ్యాంగో మ్యూజిక్‌ అధినేత రామ్‌ వీరపనేనిని వివాహం చేసుకున్నారు. జనవరిలో వీరి వివాహం జరిగింది. రెండో పెళ్లి అనంతరం సునీత చాలా సంతోషంగా ఉన్నారు. చాలా విషయాల్లో ఓపెన్‌ అయ్యారు. అదే సమయంలో రెట్టింపు ఎనర్జీతో కెరీర్‌ని ముందుకు సాగిస్తున్నారు. 
 

28

అయితే తన రెండో పెళ్లి తన పిల్లల అనుమతితోనే వారి ప్రోత్సాహంతోనే చేసుకున్నట్టు చెప్పింది సునీత. పెళ్లిలోనూ వారంతా చాలా ఉత్సాహంగా పాల్గొని తల్లికి దగ్గరుండి రెండో పెళ్లి చేశారు. పిల్లల విషయంలో రామ్‌ వీరపనేని సైతం పాజిటివ్‌గా ఉన్నారు. వారి కెరీర్‌ని బిల్డ్ చేసేందుకు తన వంతు సపోర్ట్ ఇస్తున్నారు. ఇదంతా సాఫీగా సాగిపోతుంది. 
 

38

ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది సింగర్ సునీత. ఇందులో అనేక షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. తాను ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నదో వివరించింది. ఇందులో ఆమె మాట్లాడుతూ, తాను ఎవరికి గురించి పట్టించుకోనని తెలిపింది. తాను చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్తానని, తనకంటూ ఓ గుర్తింపు ఉందని, తాను మంచి సింగర్‌ అనే పేరు అందరిలోనూ ఉందని చెప్పింది. 

48

తాను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది కామెంట్స్ చేశారని, తనను ఓన్ చేసుకుని అభిమానించి ఆదరించారని, అదే సమయంలో కొందరు ద్వేషించారని తెలిపింది. పెళ్లి కాకముందు చాలామంది మాట్లాడేవారని, పెళ్లి అయిన తర్వాత సడెన్ గా మాట్లాడం మానేశారని, అందుకే తాను ఎవరిని పట్టించుకోనని వెల్లడించారు. 

58

`నేను పెళ్లి చేసుకోవడం చాలామందికి ఇష్టం లేదు. మనకు ఒక ప్రాణం ఉంది. ఒక మనసు ఉందని సొసైటీలో చాలామందికి ఉండదు. నేను పెళ్లి చేసుకుండా ఉంటె చాలామందికి సంతోషం. నేను పెళ్లి చేసుకున్నా అంటే చాలామందికి హృదయాలు మిగిలిపోయాయని కామెంట్స్ కూడా వచ్చాయి. నేను పెళ్లి చేసుకుంటే ఎవరికీ ఎందుకు చెప్పాలి. నా ఇంట్లో వాళ్ళకి తెలుసు` అని తెలిపారు. అంతేకాదు తాను తడిగుడ్డతో గొంతు కోసిన రిలేషన్స్ చూసానని చెప్పారు.

68

మరోవైపు ఓ ప్రముఖ సంగీత దర్శకుడి స్టూడియోలో జరిగిన అవమానం గురించి చెబుతూ, `ఓ పెద్ద మ్యూజిక్‌ డైరెక్టర్‌ స్టూడియోకు పాట పాడేందుకు వెళ్లిన నాకు అనుకోని సంఘటన ఎదురైంది. అది తలుచుకుని ఓ రాత్రంతా ఏడ్చేశాను. అక్కడికి వెళ్లాక ఆ డైరెక్టర్‌ తన చేతిలో ఉన్న మైకును నాకు ఇచ్చారు. దాన్ని తీసుకొని పాట పాడేశాను. అయిపోయాక ఆ మైక్‌ అక్కడ పెట్టి తిరిగి వస్తుంటే ఆయన భార్య నన్ను పిలిచి దారుణంగా అవమానించింది.

78

`ఏంటీ మైక్‌ తీసుకునేటప్పుడు మా ఆయన చేతి వేళ్లను తాకుతున్నావ్.. అసలేమనుకుంటున్నావ్‌. నీ ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించింది. అది విని ఒక్కసారిగా షాక్‌ అయ్యాను. ఆ తర్వాత నా స్టయిల్‌లో ఆమెకు గట్టిగా సమాధానం ఇచ్చాను. అక్కడ ధైర్యంగా తనతో మాట్లాడినప్పటికీ అలా అడగడం చాలా బాధించింది. నా తప్పు లేకపోయిన నిందలు పడ్డాను. ఇంటికి వెళ్లాక ఈ సంఘటనను తలచుకుని ఓ రాత్రంత ఏడ్చాను` అని వాపోయింది సునీత. 

88

ఇలాంటి దారుణమైన సంఘటనలు తన జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అప్పుడు కొందరిని కొట్టాలనిపించింది, కానీ కొట్టకుండా వచ్చేశానంది. ఇలా చాలా సందర్భాల్లో తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories