Published : Aug 10, 2021, 01:34 PM ISTUpdated : Aug 10, 2021, 02:22 PM IST
ఇక చిరంజీవి లేటెస్ట్ ఫోటో షూట్స్ లో అయితే మతిపోగోట్టే విధంగా ఉన్నారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజా ఫోటో షూట్ లో చిరు వయసు పాతికేళ్ళు తగ్గిపోయినట్లు అనిపిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రం టాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్ లో ఒకటి. పరాజయం ఎరుగని కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుండటం, రాంచరణ్ కీలకమైన గెస్ట్ కామియో రోల్ ప్లే చేస్తుండడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. 65 ఏళ్ళ వయసులో కూడా ఈ మూవీలో సూపర్ ఫిట్ నెస్ తో చిరంజీవి కనిపిస్తున్నారు.
25
Chiranjeevi
బలమైన సోషల్ మెసేజ్, కమర్షియల్ అంశాలు కలగలిపి కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టీజర్, ఫస్ట్ లుక్ లో చూపిన విధంగా చిరు ఈ చిత్రంలో పవర్ ఫుల్ గా కనిపించబోతున్నాడు. కుర్ర హీరోలకు పోటీగా మెగాస్టార్ లుక్ ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు.
35
Chiranjeevi
ఇక చిరంజీవి లేటెస్ట్ ఫోటో షూట్స్ లో అయితే మతిపోగోట్టే విధంగా ఉన్నారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజా ఫోటో షూట్ లో చిరు వయసు పాతికేళ్ళు తగ్గిపోయినట్లు అనిపిస్తోంది. క్లాస్ లుక్ లో అదరగొడుతున్నారు. బహుశా చిరు తన నెక్స్ట్ మూవీ కోసం కొత్త లుక్ లోకి మారుతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది.
45
Chiranjeevi
ఆచార్య తర్వాత చిరు లూసిఫెర్ రీమేక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఆచార్య షూట్ పూర్తి కాగానే లూసిఫెర్ రీమేక్ మొదలవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు రెడీ అవుతున్నాయి. తమన్ మ్యూజిక్ కంపోజిషన్ కూడా స్టార్ట్ చేసేశాడు.
55
Chiranjeevi
ఆరు పదుల వయసులో కూడా ఇలాంటి చార్మింగ్ లుక్స్ మైంటైన్ చేయడం మామూలు విషయం కాదు. రీఎంట్రీ తర్వాత చిరు ఆచి తూచి అడుగులు వేస్తూ పక్కా స్క్రిప్ట్ లకే ఓకె చెబుతున్నారు. లూసిఫెర్ తర్వాత బాబీ దర్శకత్వంలో చిరు నటించాల్సి ఉంది.