ఈ క్రమంలో తన చిరకాల మిత్రుడు మ్యాంగో అధినేత రామ్, సునీతకు పెళ్లి ప్రపోజల్ పెట్టడం జరిగింది. రామ్ గురించి తెలిసిన సునీత అతనితో వివాహానికి ఒప్పుకుంది. పిల్లలతో పాటు తన భవిష్యత్ కోసం రెండో పెళ్లి నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆమె తెలియజేశారు.
2021 జనవరిలో సునీత రామ్ వివాహం ఘనంగా జరిగింది. చిత్ర ప్రముఖులతో పాటు రాజకీయవేత్తలు, సునీత మిత్రులు ఈ వివాహానికి హాజరయ్యారు. రామ్ కి అత్యంత సన్నిహితుడైన హీరో నితిన్ సతీసమేతంగా ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఇక పెళ్ళైన నాటి నుండి సింగర్ సునీత ఓ కొత్త జీవితం అనుభవిస్తున్నారు. రామ్ తో సాంగత్యం ఆమె ఎంతగానో ఆస్వాదిస్తున్నట్లు ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా తెలుస్తుంది.
ఒక దశలో సునీత ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారట. పిల్లల భవిష్యత్ గురించి ఆమె చాలా బాధపడ్డారట. ఇప్పుడు ఆమెకు అలాంటి చింత లేదు. పెళ్లి తరువాత ఆమె కెరీర్ కూడా ఊపందుకుంది. సింగర్ గానే కాకుండా పలు టీవీ కార్యక్రమాల్లో ఆమె జడ్జిగా కనిపిస్తున్నారు.
ఐకానిక్ మ్యూజిక్ షో పాడుతా తీయగా కొత్త సీజన్ కి సునీత జడ్జిగా వ్యవహరించనున్నారు. ఈ షోలో బాలుగారి కుమారుడైన ఎస్పీ చరణ్ సైతం మరో జడ్జిగా పాల్గొనడం విశేషం. కాగా మరో కొత్త రంగంలోకి సునీత అడుగుపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సునీత భర్త రామ్ సహకారంతో నిర్మాతగా మారనున్నారట. డిజిటల్ కంటెంట్ విపరీతమైన ప్రాచుర్యం పొందుతున్న తరుణంలో సునీత వెబ్ సిరీస్ లు , సినిమాలు నిర్మించాలని భావిస్తున్నారట.
దీనిపై సునీత కసరత్తు మొదలుపెట్టగా అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మీడియా, ఎంటర్టైనింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న రామ్ నేతృత్వంలో వెబ్ సిరీస్ లు నిర్మించాలని అనుకుంటున్నారట. నిర్మాతగా ఉన్న సునీత ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.