టీ షర్ట్, జీన్స్, హ్యాట్... అల్ట్రా స్టైలిష్ లుక్ లో సింగర్ సునీత... వైరల్ అవుతున్న హనీమూన్ పిక్స్!

First Published Mar 15, 2021, 9:14 AM IST


మనసుకు నచ్చినట్లు బ్రతకడమే జీవితం...వాస్తవంలో ఇది ఎవరు ఫాలో కారు. చేసే పని, కట్టే బట్ట, తినే తిండి.. ఏదైనా సమాజం ఒప్పుకుంటుందా లేదో.. చుట్టూ ఉన్నవారు నవ్వుతారేమో అనే ప్రాతిపదికనే చేస్తారు.

అవేమి పట్టించుకోని వాళ్లు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. సింగర్ సునీత ఇప్పుడు అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. ఇతరుల కోసం కాకుండా తన కోసం జీవిస్తూ... లైఫ్ ని బ్యూటిఫుల్ గా మలుచుకున్నారు.
undefined
మొదటి భర్తతో విడాకుల తరువాత సునీత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని సంవత్సరాలు ఆమె జీవితంలో చీకటి అధ్యాయం నడిచింది. భర్తకు దూరమైన సునీతపై అనేక ఆరోపణలు, వ్యక్తిగత జీవితంపై విమర్శలు రావడం జరిగింది.
undefined
వాటన్నింటినీ ఎదిరించి రెండో పెళ్లి చేసుకొని జీవితానికి గట్టి పునాది వేసుకుంది సునీత. తనను ఎంతో ఇష్టపడే వ్యక్తి రామ్ ని రెండో వివాహం చేసుకున్నారు. సునీత రెండో వివాహ నిర్ణయం అనేక విమర్శల పాలవుతుందని తెలిసి కూడా సునీత అడుగు ముందుకు వేశారు.
undefined
అయితే తన ఫ్యాన్స్ కి, శ్రేయోభిలాషులకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పిల్లలు మరియు తన భవిష్యత్ కోసం, కుటుంబ సభ్యుల సమ్మతితో రెండో పెళ్ళికి ఒప్పుకున్నట్లు తెలిపారు.
undefined
ఉమెన్స్ డే నాడు సునీత ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఆమె గత చేదు అనుభవాలను, తన పట్ల కొందరు ప్రవర్తించిన తీరును బహిర్గతం చేసింది. చేయని తప్పుకు నిందించి, తనను అణగదొక్కాలని చూశారని, అయినా ఆత్మస్థైర్యంతో అన్నింటినీ ఎదిరించింది నిలిచినట్లు సునీత కామెంట్ చేశారు.
undefined
ప్రస్తుతం మన లైఫ్ మన ఇష్టం అనే సిద్ధాతం ఫాలో అవుతున్న సునీత.. తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేస్తున్నారు. గతంలో ఎవరికీ పరిచయం లేని సునీతను మనకు చూపిస్తున్నారు.
undefined
జనవరిలో పెళ్లి చేసుకున్న సునీత... కొద్దిరోజుల క్రితం భర్తతో రామ్ తో కలిసి మాల్దీవ్స్ కి హనీమూన్ కి వెళ్లారు. మాల్దీవ్స్ లో రొమాంటిక్ బీచెస్ లో అల్ట్రా స్టైలిష్ గా సునీత కనిపించారు.
undefined
పింక్ టీ షర్ట్, జీన్స్, హ్యాట్ మరియు గ్లాసెస్ ధరించి టీనేజ్ అమ్మాయిలా సునీత దర్శనం ఇవ్వడం అందరినీ షాక్ కి గురిచేసింది.
undefined
తన మాల్దీవ్స్ వెకేషన్ పిక్స్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.
undefined
click me!