హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సాయిపల్లవి సిస్టర్ పూజా ఖన్నా డిటైల్స్ తెలిస్తే షాక్ అవుతారు!

First Published Mar 15, 2021, 8:12 AM IST

సినిమాలలో వారసత్వం అనేది చాలా సాధారణం. ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ పిల్లలు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బంధువులు కూడా వెండితెర ఎంట్రీ ఇస్తూ ఉంటారు. తాజాగా క్యూటీ సాయి పల్లవి సిస్టర్ పూజాఖన్నా కూడా వెండితెర ఎంట్రీకి సిద్ధం అయ్యారు. 

స్టంట్ మాస్టర్ సిల్వా దర్శకుడిగా తెరకెక్కుతున్న డెబ్యూ మూవీలో  హీరోయిన్ గా పూజ ఖన్నా ఎంపికయ్యారు.  దర్శకుడు సిల్వాతో పాటు సముద్ర ఖని ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు చేస్తున్నారు.
undefined
జయలలిత బయోపిక్ తెరకెక్కిస్తున్న ఏ ఎల్ విజయ్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ మరియు స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రాగా త్వరలో షూటింగ్ జరుపుకోనుంది.
undefined
కాగా పూజ గతంలో ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించారు. కారా అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ లో విడుదలైంది. అక్క సాయి పల్లవి మాదిరే పూజా కూడా మంచి డాన్సర్ అని తెలుస్తుంది.
undefined
పూజా కూడా డాన్స్ లో శిక్షణ తీసుకున్నారట. అలాగే దర్శకుడు ఏ ఎల్ విజయ్ వద్ద ఈమె అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారని సమాచారం. అక్క సాయి పల్లవి సౌత్ లో దూసుకుపోతుండగా పూజ ఖన్నా ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చూడాలి.
undefined
పెద్ద అందగత్తె కానున్నప్పటికీ కేవలం టాలెంట్ తో వెండితెరపై దూసుకుపోతుంది సాయి పల్లవి. అది కూడా  స్కిన్ షోకి దూరంగా వెండితెరపై తన మార్కు క్రియేట్ చేసింది.
undefined
గొప్ప డాన్సర్ అయిన సాయి పల్లవి సాంగ్స్ యూట్యూబ్ లో నమోదు చేసిన సంచలనాలు అనేకం. ఆమె నటించిన ఫిదా, మారి 2 చిత్రాలలోని సాంగ్స్ యూట్యూబ్ రికార్డ్స్ బద్దలు కొట్టాయి.
undefined
తాజాగా సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ చిత్రంలోని సారంగ దరియా రికార్డుల వేట మొదలుపెట్టింది. కేవలం 14రోజుల్లో 50 మిలియన్ వ్యూస్ రాబట్టి పాత రికార్డ్స్ బ్రేక్ చేసింది.
undefined
ఇక సాయి పల్లవి తెలుగులో నటించిన విరాట పర్వం, లవ్ స్టోరీ విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ రెండు చిత్రాలపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి.
undefined
click me!