ఆ గాయం మధుర జ్ఞాపకమంటోన్న సింగర్‌సునీత.. ఒక్క పదం వింటే కన్నీళ్లొస్తాయట.. నెటిజన్‌కి క్షమాపణలు

Published : May 09, 2021, 10:57 AM IST

సింగర్‌ సునీత తన గాయం సీక్రెట్‌ని పంచుకుంది. అదొక మధురమైన జ్ఞాపకమని తెలిపింది. అంతేకాదు ఒక్క పదం వింటే మాత్రం కన్నీళ్లు వస్తాయట. మరోవైపు ఓ అభిమానికి సారీ చెప్పింది సునీత. ఇలా అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది.

PREV
16
ఆ గాయం మధుర జ్ఞాపకమంటోన్న సింగర్‌సునీత.. ఒక్క పదం వింటే కన్నీళ్లొస్తాయట.. నెటిజన్‌కి క్షమాపణలు
సింగర్‌ సునీత రెండో పెళ్లి తర్వాత మరింత యాక్టివ్‌ అయ్యారు. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. సింగర్‌గా, టీవీ షోస్‌ చేస్తూ బిజీగా ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అభిమానులతో ముచ్చటిస్తుంది. వారికి కావాల్సిన పాటలు పాడుతూ అలరిస్తుంది.

26
అందులో భాగంగా తాజా లైవ్‌లో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పింది. అందులో భాగంగా తన గాయం సీక్రెట్‌ని రివీల్‌ చేసింది. చిన్నప్పుడు స్కూల్‌లో ఉన్నప్పుడు ఆడుకుంటుండగా తలకి గాయమైందని, నుదుటిపై నాలుగు కుట్లు పడ్డాయని పేర్కొంది. బట్‌ చిన్నప్పటికీ సంబంధించి అదొక మధుర జ్ఞాపకమని వెల్లడించింది.

36
తనకి `అమ్మ` అనే పదం వింటే కన్నీళ్లు వస్తాయని చెప్పింది సునీత. అద్భుతమైన పదమని, అమ్మ ఒక్కతే అమ్మ కాదు, సృష్టిలో మనకు ఇచ్చే ప్రతి ఒక్కటి అమ్మే అని తెలిపింది. తల్లిగా ఉండటం గొప్ప అనుభూతి అని, ఈ జీవితానికి అంతకంటే ఏం అవసరం లేదని తెలిపింది. మదర్స్ డే సందర్భంగా అందరికి శుభాకాంక్షలు చెబుతూ, స్త్రీలను గౌరవించడం, ఇంట్లో అమ్మని బాగా చూసుకోవడమే అమ్మకి ఇచ్చే గొప్ప బహుమతి అని తెలిపింది.

46
తాను ఫస్ట్ టైమ్‌ టీవీ షో చేస్తున్నానని, మంచి ఎక్స్ పీరియెన్స్ నిస్తుందని చెప్పింది. `డ్రామా జూనియర్స్`కి జడ్జ్ గా చేస్తున్నట్టు తెలిపింది. చిన్న చిన్న పిల్లలు ఎంతో ప్రతిభతో ఉన్నారని, వారిని చూస్తుంటే ముచ్చటేస్తుందని పేర్కొంది.

56
ఈ సందర్భంగా సునీత అభిమానికి క్షమాపణలు చెప్పింది. ఎందుకంటే అతను సునీత వాట్సాప్‌ నెంబర్‌ అడిగారు. దీంతో సారీ అని చెప్పింది. ఇక ఆద్యంతం పాటలతో సాగిన సునీత లైవ్‌ ఛాట్‌ శ్రోతలను, నెటిజన్లని ఒలలాడించిందని చెప్పొచ్చు. ఇకపై ప్రతి రోజు సాయంత్రం ఎనిమిది గంటలకు లైవ్‌ ఛాట్‌ చేస్తానని, పాటలు పాడతానని తెలిపింది సునీత.

66
సింగర్‌ సునీత ఈ ఏడాది జనవరిలో సెకండ్‌ మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. డిజిటల్‌ రంగానికి చెందిన రామ్‌ వీరపనేనిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ చాలా బ్యూటీఫుల్‌గా ఉందని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పింది. పిల్లలిద్దరు బాగున్నారని తెలిపింది. చివరగా కరోనా జాగ్రత్తలు తెలిపారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories