సంగీత ప్రియుల మనసు దోచిన పాడుతా తీయగా షోలో బాలుతో పాటు ఆమె జడ్జి సీటు పంచుకున్నారు. పలు సీజన్స్ కి సునీత, ఎస్పీ బాలు పనిచేశారు. ఎస్పీ బాలును సునీత మామయ్య అని పిలిచేవారట. ఆయన కూడా ఆప్యాయంగా కోడలా అనేవారట. కుటుంబ సభ్యులకు మించిన సాన్నిహిత్యం ఇద్దరి మధ్య ఉండేది.