Singer Sid Sriram: హీరోగా మారబోతున్న స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్.. డైరెక్టర్ ఎవరంటే....?

First Published | Jan 10, 2022, 2:37 PM IST

టాలీవుడ్,కోలీవుడ్,బాలీవుడ్.. అన్ని ఇండస్ట్రీలో.. అద్భుతమైన గాత్రంతో రాణిస్తున్న యంగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్. ఈ గాయకుడు త్వరలో హీరో అవతారం ఎత్తబోతున్నట్టు తెలుస్తోంది.

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎం అవుతారో తెలియదు. కమెడియన్లు హీరోలు అయ్యారు.. డైరెక్టర్లు హీరోలు అయ్యారు. హీరోలు నిర్మాతలు అవుతున్నారు.. డైరెక్టర్లు అవుతున్నారు. ఈమధ్య సింగర్లు కూడా హీరోలుగా మారుతున్నారు. ఆ లిస్ట్ లోకి స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్(Sid Sriram) కూడా చేరాడు. సిద్ శ్రీరామ్ కు సింగర్ గా మంచి క్రేజ్ ఉంది. దాదాపు ఇండియాలో ఫేమస్ లాగ్వేజెస్ అన్నింటిటో పాటలు పాడారు శ్రీరామ్.

ఏఆర్ రెహమాన్(A.R. Rahaman) పరిచయం చేసిన ఈ ఎన్నారై కుర్ర సింగర్... వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం శ్రీరామ్(Sid Sriram) పాట లేని సినిమా ఉండటం లేదు. పొరపాటున సినిమా ప్లాప్ అయినా.. ఆ సినిమాలో సిద్ శ్రీరామ్ పాట ఉంటే చాలు.. ఆ సినిమా జనాలకు రిజిస్టర్ అవుతుంది. శ్రీరామ్ పాటలో అంత మ్యాజిక్ ఉంటుంది. డిఫెరెంట్ వాయిస్ తో శ్రీరామ్ పాడే పాటలు మత్తు జల్లుతాయి.


ఇప్పటికే ఎన్నో పాటలతో యూత్ ను అట్రాక్ చేస్తున్నాడు శ్రీరామ్. క్లాసికల్ కచేరీలు కూడా ఇస్తున్నాడు. మణిరత్నం కడలి సినిమా ద్వారా వెండితెరకు సింగర్ గా పరిచయం అయ్యాడు సిద్.. ఆతరువాత తిరిగిచూడలేదు. తమిళంలో కంటే.. తెలుగులోనే సిద్ శ్రీరామ్(Sid Sriram) కు ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. ఇక త్వరలో హీరోగా కూడా అలరించబోతున్నాడు సిద్ శ్రీరామ్.

తనను సింగర్ గా వెండితెరకు పరిచయం చేసిన కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ మణిరత్నం(Maniratnam)  డైరెక్షన్ లోనే వెండితెరకు హీరోగా పరిచయం కాబోతున్నాడట సిద్ శ్రీరామ్(Sid Sriram). శ్రీరామ్ కోసం మణిరత్నం మంచి కథను తయారు చేసినట్టు తమిళ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయ్యిందని.. కథ విని శ్రీరామ్ కూడా హీరోగా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుసమాచారం.

అయితే సంగీత ప్రధానంగా ఉండే కథలో శ్రీరామ్ నటిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులోను మణిరత్నం సినిమా అంటే ఎలా చెక్కుతారో తెలుసు. ప్రస్తుతం పొన్నియన్ సెల్వమ్ తెరకెక్కించడంలో బిజీగా ఉన్నాడు మణిరత్నం. ఈ సినిమా తరువాత శ్రీరామ్(Sid Sriram) ను సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మణిరత్నం(Maniratnam) ఫామ్ లో లేడు. ఆయన సినిమాలు ఇప్పటి యూత్ కు పెద్దగా నచ్చడం లేదు. మరి శ్రీరామ్ లక్ ఎలా ఉంటుందో చూడాలి.  

Latest Videos

click me!