ట్రెండ్ ఫాలో అవుతున్న మంగ్లీ సైతం గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటో షూటింగ్ ఒకింత హద్దులు దాటేసినట్లుగా ఉంది. ఆమె షర్ట్ ముడివేసి బోల్డ్ లుక్ లో దర్శనమిచ్చింది. మంగ్లీ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
27
Singer Mangli
ఇక టాలీవుడ్ లో స్టార్ సింగర్ గా వెలిగిపోతుంది మంగ్లీ. ఆమె వచ్చాక చాలా మంది మరుగున పడ్డారు. ఫోక్, డివోషనల్, ఐటెం సాంగ్స్ కి ఆమె పెట్టింది పేరు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి సాంగ్ లో తన మార్క్ చూపిస్తుంది.
37
Singer Mangli
గత నాలుగేళ్లుగా మంగ్లీ టాలీవుడ్ లో సత్తా చాటుతుంది. జార్జి రెడ్డి మూవీలోని రాయల్ ఎన్ఫీల్డ్ సాంగ్ మంగ్లీకి మంచి పేరు తెచ్చింది. అనంతరం అల వైకుంఠపురంలో రాములో రాములా, లవ్ స్టోరీ చిత్రంలోని సారంగదరియా సాంగ్స్ విపరీతమైన ఆదరణ పొందాయి.
47
Singer Mangli
మంగ్లీ ప్రత్యేకమైన గాత్రం పాటలను వినసొంపుగా మార్చేస్తుంది. గత ఏడాది విడుదలైన విక్రాంత్ రోనా చిత్రంలో రక్కమ్మ సాంగ్ యూత్ ని ఊపేసింది. ఎక్కడ చూసినా అదే పాట వినిపించింది. ఆ సినిమా విజయంలో రక్కమ్మ సాంగ్ భాగమైంది.
57
Singer Mangli
చిత్తూరుకు చెందిన మంగ్లీ బంజారా కమ్యూనిటీలో జన్మించారు. మంగ్లీ ప్రస్తుత వయసు 29 సంవత్సరాలు. ఎస్వీ యూనివర్సిటీలో మంగ్లీ మ్యూజిక్ లో డిప్లొమా చేశారు. ఆమె తండ్రి చిన్నప్పటి నుండి సింగర్ గా ప్రోత్సహించాడు.
67
Singer Mangli
2013లో V6 ఛానల్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంగ్లీకి బ్రేక్ వచ్చింది. ప్లే బ్యాక్ సింగర్ అయ్యాక వరుస ఆఫర్స్ తో స్టార్ సింగర్ అయ్యారు. మంగ్లీ హీరోయిన్ గా స్వేఛ్చ టైటిల్ తో ఒక మూవీ తెరకెక్కింది. నితిన్ హీరోగా తెరకెక్కిన మ్యాస్ట్రో మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసింది. మంగ్లీకి సొంతగా యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో సీజనల్ సాంగ్స్ చేస్తుంది.
77
Singer Mangli
సింగర్ మంగ్లీ పాటకు మూడు లక్షల వరకు తీసుకుంటున్నారని సమాచారం. ఆమెకు అంత డిమాండ్ ఉంది. తన సంపాదనతో సొంత ఊరిలో దేవాలయం కట్టించిందట. సామాజిక సేవకు కూడా మంగ్లీ డబ్బులు ఖర్చు చేస్తారని సమాచారం. మంగ్లీ సింగర్ గా అభిమానులను సంపాదించుకుంది.