ఫోక్ సాంగ్స్ తో పాపులర్ అయిన స్టార్ సింగర్ మంగ్లీ మరో వివాదంలో చిక్కుకుంది. ఆమెపై కేసునమోదయ్యింది. మంగ్లీ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ బాధితుడి పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మంగ్లీతో పాటు ఈ కేసులో ఉన్న స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన ఫోక్ సింగ్ మంగ్లీ.. కంచు కంఠంతో.. జానపద, సినీ గీతాలు పాడుతూ... కోట్లాది అభిమానులను ఉర్రూతలూగిస్తుంది మంగ్లీ. సింగర్ గా, నటిగా, మ్యూజిక్ డైరెక్టర్ గా, డ్యాన్సర్ గా మల్టీ టాలెంట్ చూపిస్తోన్న మంగ్లీ.. ఎంత పాపులర్ అయ్యిందో.. అంతే వివాదం అవుతోంది. ఇప్పటికే పలు కాంట్రవర్సీల్లో ఇరుక్కుని.. ఇబ్బంది పడిన మంగ్లీ.. తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. సింగర్ మంగ్లీ ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలతో వార్తల్లో నిలిచారు. పెట్టుబడుల పేరుతో మోసం చేయడమే కాకుండా, బాధితుల తరపున ప్రశ్నించిన న్యాయవాదిని బెదిరించారనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.
24
100 మందిని మంగ్లీ టీమ్ మోసం చేసిందా?
ఈ కేసులో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, అలాగే ‘విరాటపర్వం’ చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల పేర్లు కూడా ఉండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు , బాధితుల కథనం ప్రకారం, మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరికొంతమందితో కలిసి ఒక టీమ్ గా ఏర్పడి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే అధిక లాభాలు వస్తాయని నమ్మించినట్టు సమాచారం. ఇలా దాదాపు 100 మంది బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
34
మంగ్లీతో పాటు స్టార్ డైరెక్టర్ పై కూడా..
డబ్బు తీసుకుని నెలలు గడిచినా బాధితులకు లాభాలు గానీ, పెట్టుబడి పెట్టిన అసలు డబ్బు గానీ తిరిగి ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో మోసపోయామని భావించిన బాధితులు న్యాయం కోసం న్యాయవాది సుబ్బారావును సంప్రదించారు. బాధితుల తరపున రంగంలోకి దిగిన న్యాయవాది సుబ్బారావు, చెల్లించాల్సిన డబ్బుల గురించి మంగ్లీ బృందాన్ని నిలదీశారు. ఈ క్రమంలోనే తనకు తీవ్రమైన బెదిరింపులు ఎదురయ్యాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఉడుగుల తనకు ఫోన్ ద్వారా సంప్రదించి “యాక్సిడెంట్ చేయించి చంపేస్తాం” అంటూ హెచ్చరించారని, తమ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పంజాగుట్ట పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆరోపణలకు బలం చేకూర్చే కొన్ని ఆధారాలు లభించడంతో మంగ్లీ, శివ, వేణు ఉడుగులతో పాటు మరికొందరిపై చీటింగ్, బెదిరింపుల కింద వివిధ సెక్షన్లలో కేసు నమోదు చేశారు.ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనతో సినీ పరిశ్రమలో చర్చలు జోరందుకున్నాయి. వరుస అవకాశాలతో కెరీర్‌లో ఉన్నత స్థాయిలో ఉన్న మంగ్లీపై ఇలాంటి క్రిమినల్ ఆరోపణలు రావడం గమనార్హంగా మారింది. గతంలో కూడా మంగ్లీ ఫ్యామిలీ వేడుకల్లో మారకద్రవ్యాలంటూ .. రచ్చ జరిగింది. అందుకు ముందు కూడా ఆమెపై రకరకాల వివాదాలు ఉన్నాయి.