Bigg boss nonstop: నేను సెకండ్ హ్యాండ్ అయిపోయా టైటిల్ ఇవ్వరు... సింగర్ గీతా మాధురి ఓపెన్ స్టేట్మెంట్

Published : Feb 23, 2022, 01:26 PM ISTUpdated : Feb 23, 2022, 01:28 PM IST

బిగ్ బాస్ సీజన్ 5 ముగిసి మూడు నెలలు గడవకుండానే ఓటిటీ వర్షన్ వచ్చేస్తుంది. ఫిబ్రవరి 26 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్ బాస్ నాన్ స్టాప్ (Bigg Boss Nonstop)ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 2 రన్నర్ సింగర్ గీతా మాధురి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   

PREV
17
Bigg boss nonstop: నేను సెకండ్ హ్యాండ్ అయిపోయా టైటిల్ ఇవ్వరు... సింగర్ గీతా మాధురి ఓపెన్ స్టేట్మెంట్


ఆమె (Geetha Madhuri)మాట్లాడుతూ... బిగ్ బాస్ ఓటీటీ ఆఫర్ నాకు కూడా వచ్చింది. అయితే ఇప్పుడున్న కమిట్మెంట్స్ కారణంగా వెళ్లడం లేదు. ప్రొఫెషనల్ గా బిజీగా ఉన్నాను. అలాగే నాకు బేబీ ఉంది. ప్రస్తుతానికి బిగ్ బాస్ షోలో పాల్గొనే ఆసక్తి లేదు. అయితే నేను బిగ్ బాస్ షోని చాలా ఇష్టపడతాను. ఆ ప్రపంచం చాలా భిన్నంగా ఉంటుంది. 

Photo credit: Daily culture 

27


బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొంటే కప్పుకొడతానని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు నేను సెకండ్ హ్యాండ్. ఒకసారి బిగ్ బాస్ కి వెళ్ళాను కాబట్టి రెండోసారి వెళితే సెకండ్ హ్యాండ్ అవుతాను. ఆల్రెడీ ఒకసారి షోకి వెళ్లిన వాళ్లకు కప్పు రాదు. ఎందుకంటే ఫ్రెష్ టాలెంట్ కే కప్పు గెలుచుకునే అర్హత ఉంటుంది. 

Photo credit: Daily culture 

37

అందరూ పాత కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ షో నడిపితే ఓకె. ఈసారి పాత కంటెస్టెంట్స్ తో పాటు కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాతవారికి కప్పు గెలిచే అవకాశం ఇస్తే అది కొత్తవాళ్లను అన్యాయం చేసినట్లు అవుతుంది. ఎందుకంటే పాత వాళ్లకు అనుభవం ఉంది కాబట్టి వాళ్లతో కొత్తవాళ్లను పోటీకి దించడం సరైంది కాదు.

 

Photo credit: Daily culture 

47

ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి నేను ఇచ్చే సలహా జాగ్రత్తగా మాట్లాడాలి. కెమెరాలు అన్ని వేళలా మనల్ని గమనిస్తూ ఉంటాయి. మాట జారితే తీసుకోలేం. సోషల్ మీడియా ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. కాబట్టి ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి.

57

బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు. మనం మనలా ఉంటేనే ప్రేక్షకులు ఇష్టపడతారు. ఎక్కువ కాలం నటించలేం. మనకు తెలియకుండానే ఎమోషన్స్ బయటికి వచ్చేస్తాయి. నటిస్తూ బ్రతకం సాధ్యం కాదు. ఇక నేను ఫ్లోను బట్టి వెళ్ళిపోతా. భవిష్యత్ లో అవకాశాన్ని బట్టి షోలో పాల్గొనే అవకాశం ఉంది.. అన్నారు.

67


ఇక బిగ్ బాస్ షో గురించి గీతా మాధురి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆమె మాటలను బట్టి చూస్తే చాలా మంది పాత కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ఎంత మంది కంటెస్టెంట్స్, ఎవరెవరు హౌస్ లోకి వెళుతున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. 

77

బిగ్ బాస్ ఓటీటీ వారంలో ఏడు రోజులు 24 గంటలు ప్రసారం కానుంది. ప్రతి నిమిషం కెమెరాలు కంటెస్టెంట్స్ ని గమనిస్తూ ఉంటాయి. ఒక టైం తో సంబంధం లేకుండా బిగ్ బాస్ ప్రేమికులు షోని ఎంజాయ్ చేయవచ్చు. ఓటీటీ వర్షన్ కావడంతో మసాలా డోస్ కూడా ఎక్కువ ఉండే ఆస్కారం కలదు.

click me!

Recommended Stories