Sing Geetham Collection: సింగ్‌ గీతం మూవీ 3 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంత దారుణమా?

Published : Jun 15, 2026, 04:12 PM IST

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన `సింగ్‌ గీతం` చిత్రం మూడు రోజులు పూర్తి చేసుకుంది. మరి తొలి వీకెండ్‌లో ఇది ఎంత వసూలు చేసిందనేది చూస్తే. 

PREV
14
సింగ్‌ గీతం మూవీ థియేటర్లో సందడి

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ `సింగ్‌ గీతం`. తన పేరుతోనే ఈ చిత్రాన్ని ఆయన రూపొందించడం విశేషం. తన 95ఏళ్ల వయసులో దీన్ని తెరకెక్కించారు. ఇలా ఈ ఏజ్‌లో దర్శకత్వం వహించిన దర్శకుడిగా ప్రపంచ రికార్డు సృష్టించారు సింగీతం. దీనికి మరో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అయితే తెలుగు సినిమాల్లోనే కాదు, ఇండియన్‌ మూవీస్‌లోనూ ఇదొక ప్రయోగాత్మక మూవీ అని చెప్పొచ్చు. మాటలు, కాదు పాటలతో రన్‌ కావడమే సినిమా విశేషం. ఇదే ఇందులో కొత్తదనం.

24
సింగ్‌ గీతం మూవీలో ఏం చూపించారంటే?

సినిమా కుబేరపురం అనే ఒక ఫిక్షన్‌ విలేజ్‌లో సాగుతుంది. అదంతా ఏడారి. అక్కడ ఒకే చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కిందనే బంగారు గనులుంటాయి. వాటిని తవ్వేందుకు ఒక మైనింగ్‌ కంపెనీ ప్రయత్నం చేస్తుంది. అందులో హీరో అప్పుడే జైలు నుంచి రిలీజ్‌ అవుతాడు. అతని లాయర్‌ మీ నాన్న నీకు రాసిచ్చిన ఆస్తులు అని ఒక సూట్‌కేస్‌ ఇస్తాడు. అందులో 99ఎకరాల ల్యాండ్‌ పేపర్లు ఉంటాయి. బంగారు గనులు ఉన్న స్థలమే హీరో ల్యాండ్‌. దీంతో మైనింగ్‌ కంపెనీ హోనర్‌తో ఫిఫ్టీ ఫిఫ్టీకి డీల్‌ కుదుర్చుకుంటారు. అయితే చెట్టుని కొట్టొందని హీరోయిన్‌ ప్రయత్నం చేస్తుంది. దాన్ని రక్షిస్తూ ఉంటుంది. కానీ చివరికి చెట్టుని కొట్టేస్తారు. మైనింగ్‌ స్టార్ట్ చేస్తారు. దీనిపై బాధపడ్డ హీరోయిన్‌ దేవుడితో తన బాధని వ్యక్తం చేస్తుంది. ఆ తర్వాత ఊర్లో అందరికి మాటలు పోతాయి. పాటలు వస్తుంటాయి. మరి ఆ ఊరు కథేంటి? అలా ఎందుకు జరిగింది? చివరికి ఏం జరిగిందనేది ఈ సినిమా కథ.

34
సింగ్‌ గీతం ద్వారా వచ్చిన సందేశం ఇదే

మనం మాట్లాడే మాటలు, పాటలుగా రావడమే ఈ మూవీలో ఉన్న కొత్తదనం. అంతేకాదు ఆ ఊరు కూడా కొత్తగా విచిత్రంగా ఉంటుంది. సినిమాగా ఇది ఫస్టాఫ్‌ చాలా స్లోగా ఉంటుంది. అర్థం కాని విధంగా ఉంటుంది. ఇంటర్వెల్‌ బాగుంటుంది. సెకండాఫ్‌ కూడా అదే కొనసాగుతుంది. కాకపోతే డ్రామా ప్రధానంగా సాగుతుంది. చివర్లో ఎమోషనల్‌గా ఉంటుంది. అయితే పర్యావరణాన్ని రక్షించాలని, చెట్లని పెంచాలనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా అందించారు. మేకింగ్‌ పరంగా, కథనం పరంగా కొత్తగా ఉన్న ఈ మూవీకి పెద్దగా ఆదరణ దక్కడం లేదు. జనాలు పట్టించుకోవడం లేదు.

44
సింగ్ గీతం మూవీ కలెక్షన్లు

సరైన ప్రమోషన్స్ లేకపోవడం, కొత్తతరహా కథ కావడంతో ఆడియెన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో కలెక్షన్లు దారుణంగా ఉంటున్నాయి. ఈ మూవీ మూడు రోజుల్లో ఇండియాలో రూ.3.14కోట్లు వసూలు చేసింది. మొదటి రోజు కేవలం రూ.73లక్షలు మాత్రమే వచ్చాయి. రెండో రోజు కోటీ రూ.14 లక్షలు, మూడో రోజు కోటీ రూ.26లక్షలు వసూలు చేసింది. రూ.2.7కోట్ల నెట్‌ రాబట్టింది. అయితే రోజు రోజుకి ఈ మూవీకి కలెక్షన్లు పెరగడం విశేషం. సినిమాకిది పాజిటివ్‌ నోట్‌గా చెప్పొచ్చు. కాకపోతే సినిమా రేంజ్‌కిది చాలా తక్కువే. సోమవారం నుంచి వచ్చే కలెక్షన్లని బట్టి ఈ మూవీ భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది. ఇక సినిమాలొ ఆయాన్‌, రాహుల్‌ రవీంద్రన్‌, గౌరి, శాలిని, నివేతా పేతురాజ్‌ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories