Balakrishna Wife Background: బాలకృష్ణ భార్య వసుంధర దేవి బ్యాక్‌ గ్రౌండ్‌ తెలిస్తే మతిపోతుంది.. పుట్టుకతోనే ఇంత రిచ్చా?

Published : Jun 15, 2026, 01:53 PM IST

నందమూరి నట సింహం బాలకృష్ణ.. తన ఫ్యామిలీ గురించి, ముఖ్యంగా తన భార్య గురించి ఎప్పుడూ పెద్దగా ప్రస్తావించలేదు. కానీ వసుంధర దేవి బ్యాక్‌ గ్రౌండ్‌ తెలిస్తే మాత్రం మతిపోవాల్సిందే. 

PREV
14
అత్యంత సక్సెస్‌ఫుల్‌ హీరో బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ.. టాలీవుడ్‌లో టాప్‌ హీరోగా, సీనియర్లలో ఒకరిగా రాణిస్తున్నారు. ఇటీవల కాలంలో అత్యంత సక్సెస్‌ రేట్‌ ఉన్న హీరో కూడా బాలయ్యనే కావడం విశేషం. వరుసగా నాలుగు విజయాలు అందుకున్న బాలయ్యకి ఇటీవల `అఖండ 2`తో బ్రేకులు పడ్డాయి. కానీ ఇప్పుడు `ఎన్బీకే 111`తో బౌన్స్ బ్యాక్‌ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. గోపీచంద్‌ మలినేనితో ఈ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఇటీవల గ్లింప్స్ విడుదలయ్యింది. అది బాగా ఆకట్టుకుంది. సినిమాలపై అంచనాలను పెంచింది.

24
1982లో వసుంధర దేవిని పెళ్లి చేసుకున్న బాలయ్య

ఇదిలా ఉంటే బాలయ్య తన ఫ్యామిలీ గురించి ప్రస్తావన ఎప్పుడూ తీసుకురారు. ఆయన కూతుళ్ల గురించి ప్రస్తావన వస్తుంటుంది. కానీ తన భార్య గురించి చాలా తక్కువగా మాట్లాడతాడు బాలయ్య. బాలకృష్ణకి 1982లో వసుంధర దేవితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కూతుళ్లు నారా బ్రాహ్మాణి, తేజస్వినితోపాటు కొడుకు మోక్షజ్ఞ తేజ ఉన్న విషయం తెలిసిందే. కూతుర్లకి పెళ్లిళ్లు అయ్యాయి. కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత మూడు నాలుగేళ్లుగా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటికీ క్లారిటీ లేదు.

34
వసుంధర దేవి బ్యాక్‌ గ్రౌండ్‌

ఈ క్రమంలో బాలయ్య భార్యకి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటో తెలిసింది. వసుంధర దేవి పుట్టుకతోనే రిచ్‌ అట. ఆమె శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్ పోర్ట్ (SRMT) అధినేత దేవరపల్లి సూర్యారావు కుమార్తె. పుట్టుకతోనే అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన వసుంధర గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే 1982లో బాలకృష్ణను వివాహం చేసుకున్నారు. వసుంధర దేవి ఫ్యామిలీ ఆస్తులు.. బాలయ్యని మించిన ఉంటాయని, వందల కోట్లు ఆస్తులున్నట్టు సమాచారం.

44
పబ్లిక్‌కి దూరంగా వసుంధర దేవి

అయినా వసుంధర దేవి  చాలా వరకు పబ్లిక్‌కి దూరంగా ఉంటారు. ఎలాంటి హంగులు ఆర్బాటాలు లేకుండా కూల్‌గా ఉంటారు. బయటకు పెద్దగా రారు, మీడియాకి దూరంగా ఉంటారు. పూర్తిగా ఫ్యామిలీకే పరిమితమై ఉంటారు. పిల్లలు సరైన మార్గంలో నడవడంలో, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలో ఆమె పాత్ర ఎంతో ఉంది. బాలయ్య హ్యాపీగా సినిమాలు చేస్తున్నాడంటే దాని వెనకాల వసుంధర దేవి కృషి ఉందని చెప్పొచ్చు. కానీ ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ మాత్రం భారీగా ఉండటం విశేషం. బాలయ్య, వసుంధర దేవికి పెళ్లై 44ఏళ్లు అవుతుంది. ఇప్పటికీ వీరిద్దరి మంచి అన్యోన్యమైన దంపతులుగా రాణిస్తుండటం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories