Simran To Rambha: సిమ్రాన్ నుంచి రంభ వరకు..సీనియర్ హీరోయిన్లు ఐటెం సాంగ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా

Published : May 01, 2026, 11:20 AM IST

సీనియర్ హీరోయిన్లు ఐటెం సాంగ్స్ చేసే ఆ సినిమా ఆల్మోస్ట్ హిట్ అయినట్లే. రంభ, రమ్యకృష్ణ లాంటి హీరోయిన్లకు స్పెషల్ సాంగ్స్ లో మంచి రికార్డ్ ఉంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
17
Ramya Krishnan

సీనియర్ హీరోయిన్లు కొంతమంది మహేష్, ఎన్టీఆర్ లాంటి హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేశారు. ఆ సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. సిమ్రాన్ నుంచి రంభ వరకు తమ తర్వాతి జనరేషన్ హీరోలతో చేసిన స్పెషల్ సాంగ్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

27
ప్రభాస్ - సిమ్రాన్

సిమ్రాన్ టాలీవుడ్ లో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో నటించింది. ఆమె స్టార్ గా వెలిగిపోతున్న టైంలో ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రభాస్ రాఘవేంద్ర చిత్రంలో సిమ్రాన్ స్పెషల్ సాంగ్ చేసింది. కలకత్తా పాన్ అనే సాంగ్ అప్పట్లో యువతని బాగా ఆకట్టుకుంది. రాఘవేంద్ర చిత్రంలోనిది ఈ పాట. సినిమా కూడా పర్వాలేదనిపించే సక్సెస్ అందుకుంది.

37
ఎన్టీఆర్ - రమ్యకృష్ణ

జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ని తారా స్థాయికి తీసుకెళ్లిన చిత్రం సింహాద్రి. ఈ మూవీలో రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్ చేసింది. చీకులమ్మే చిన్నది అనే ఐటెం సాంగ్ మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.

47
అల్లు అర్జున్ - రంభ

దేశముదురు మూవీలో సీనియర్ నటి రంభ.. అల్లు అర్జున్ తో కలసి స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇది కూడా మంచి మాస్ బీట్. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన దేశముదురు మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.

57
రవితేజ - రాసి

మాస్ మహారాజ్ రవితేజ వెంకీ మూవీలో హీరోయిన్ రాసి స్పెషల్ సాంగ్ చేసింది. సిలకేమో శీకాకుళం అనే పాటలో రాసి పెర్ఫామ్ చేసింది. హోమ్లీ హీరోయిన్ గా ఆకట్టుకున్న రాసి ఈ మూవీలో స్పెషల్ సాంగ్ చేయడం అప్పట్లో సంచలనమే.

67
ఎన్టీఆర్ - రంభ

దేశముదురు చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన తర్వాత కొన్ని నెలల్లోనే యమదొంగ చిత్రంలో రంభ మరో స్పెషల్ సాంగ్ చేసింది. నాచోరే నాచోరే అంటూ సాగే పాటలో ఎన్టీఆర్, రంభ ఇద్దరూ డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టారు. తారక్ బెస్ట్ డాన్స్ నంబర్స్ లో ఈ సాంగ్ కూడా ఒకటి. సినిమా కూడా సూపర్ హిట్ అయింది.

77
మహేష్ బాబు - రమ్యకృష్ణ

రమ్యకృష్ణ మహేష్ బాబుతో కూడా స్పెషల్ సాంగ్ చేసింది. నాని చిత్రంలో మహేష్ తో కలసి రమ్యకృష్ణ రొమాంటిక్ సాంగ్ చేసింది. అయితే ఈ మూవీ డిజాస్టర్ అయింది.

Read more Photos on
click me!

Recommended Stories