గురు (సందీప్ కిషన్) తన తల్లి జ్ఞాపకార్థం ఒక లైబ్రరీ నడుపుతుంటాడు. అతనికి పీకల్లోతు అప్పులు ఉంటాయి. ఎలాగైనా డబ్బు సంపాదించాలని అతను అనుకుంటాడు. మరోవైపు వీరయ్య రెడ్డి (సంపత్ రాజ్), విన్సెంట్ కలిసి మాఫియా, క్యాసినో బిజినెస్ చేస్తుంటారు. దీని వెనుక పెద్ద మాదక ద్రవ్యాల దందా నడుస్తుంటుంది. ఒక కంటైనర్‌లో 1000 కోట్ల రూపాయలు ఉంటాయి.
దాని తాళం, పెన్ డ్రైవ్ విన్సెంట్ దగ్గర ఉంటాయి. ఈ టైమ్‌లో రెడ్డి, విన్సెంట్ విడిపోతారు. రెడ్డి మీద పోలీసుల అటాక్ జరుగుతుంది, కానీ అతను తప్పించుకుంటాడు. ఆ తాళం కోసం వేట మొదలవుతుంది. ఈ 1000 కోట్ల మ్యాటర్ గురు టీమ్‌కి (ఫరియా, రాజు సుందరం) తెలుస్తుంది. వాళ్లు ఆ డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఏమైందనేదే మిగతా కథ.