Ravi Teja
సినిమాలో సర్పైజ్ ఫాక్టర్స్ బాగా వర్కవుట్ అవుతున్నాయి. ఈ విషయం డైరక్టర్స్ అర్దం చేసుకుని ముందుగా ప్లాన్ చేసుకుంటున్నారు. కమర్షియల్ సినిమాల్లో ఈ ఎలిమెంట్స్ కు ఎక్కువ ప్రయారిటీ ఉంటోంది. థియేటర్ లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చే ఈ సీన్స్ లో చేయటానికి మిగతా హీరోలు కూడా ఉత్సాహం చూపెడుతున్నారు. ఆ క్రమంలో రవితేజ తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’లో సర్పైజ్ రోల్ లో యంగ్ హీరో కనిపించబోతున్నారు. ఆ హీరో ఎవరు?
మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. జగపతి బాబు విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఇప్పటికే వదిలిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఆగస్టు 15 న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు తాజా సమాచారం బయటికొచ్చింది. దాని ప్రకారం.. మిస్టర్ బచ్చన్ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Mr Bachchan
ఈ సినిమాలో సర్పైజ్ రోల్ లో సిద్దు జొన్నలగడ్డ కనిపించనున్నారు. ఈ మేరకు జూలై 30న రవితేజ, సిద్దు జొన్నలగడ్డ మధ్య షూట్ జరగనుంది. ఆ ఎపిసోడ్ క్లైమాక్స్ లో వస్తుంది. అంటే క్లైమాక్స్ లో సిద్దు జొన్నలగడ్డ కనిపించనున్నారు. థియేటర్ నుంచి బయిటకు వచ్చేటప్పుడు కిక్ మరీ పంపటానికి ఇలా హరీష్ శంకర్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
Mr Bachchan
హీరో రవితేజ (Ravi Teja) స్పెషాలిటీ ఏమిటంటే..ఎన్ని ప్లాఫ్ లు వచ్చినా ఓపినింగ్స్ కు లోటు ఉండదు. బిజినెస్ అయితే ఎవర్ గ్రీన్ గా ఉంటుంది. అందుకు తగినట్లుగా తనకు కలిసొచ్చిన డైరక్టర్ తో జతకడితే ఇంక చెప్పేదేముంది. ఫ్యాన్స్ కే కాదు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కు పండగే. ఈ చిత్రం ప్రీమియర్స్ ఆగస్టు 14న ప్రదర్శించనున్నారు.
Mr Bachchan
హిందీలో అజయ్ దేవగన్ హీరోగా చేసిన రైడ్ సినిమాకు రీమేక్ ఇది. ఇన్కమ్ టాక్స్ రైడ్ నేపధ్యంలో జరిగే కథ ఇది. అయితే ఈ సినిమాను రీమేక్ లా కాకుండా హరీష్ శంకర్ ఈ కథకు తనదైన స్టయిల్లో మాస్ టచ్ ఇచ్చారని తాజాగా వచ్చిన షో రీల్ చూస్తుంటే క్లారిటీ వస్తుంది. ఈ సినిమాలో మంచి మాస్ టచ్ వుందని, రైడ్ స్క్రిప్టుని పూర్తి మాస్ అప్పీలింగ్ తో తయారు చేసారని చెప్తున్నారు. రీమేకులు చేయడంలో కూడా హరీష్ శంకర్ కి సెపరేట్ స్టయిల్ వుంది. రైడ్ తో పోలిక రాకుండా మిస్టర్ బచ్చన్ కి ట్రీట్మెంట్ చేశారాయన.
యాక్షన్ అధిక ప్రాధాన్య చిత్రమిది. బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ అభిమాని అయిన రవితేజ ఈ సినిమాలోనూ ఆయన ఫ్యాన్‌గా కనిపించనున్నారని సమాచారం. నిజాయతీ గల ఆదాయపన్ను అధికారిగా కనిపించనున్నట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. ఆ అధికారి ఓ రాజకీయ నాయకుడి ఇంటికి రైడ్‌కు వెళ్లాక ఏం జరిగిందన్నది కథాంశం. ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ 40 కోట్లు దాకా జరిగిందని వినికిడి. అంటే ఓ రేంజిలో బిజినెస్ జరిగినట్లే. ఓటిటి, హిందీ యూట్యూబ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కలిపితే పూర్తి లాభాల్లో రిలీజ్ కు ముందే వెళ్లినట్లు అర్దమవుతోంది.
హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం కావడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది వరకు వచ్చిన షాక్, మిరపకాయ్ ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. క్యాడ్‌బరీ యాడ్‌తో క్రేజ్ సంపాదించుకున్న భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. జగపతి బాబు విలన్ పాత్ర పోషించారు. .