Jack Movie
టిల్లు హీరోగా సిద్దు జొన్నలగడ్డకి యువతలో సూపర్ క్రేజ్ వచ్చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో రొమాంటిక్ కామెడీ పండించడంలో సిద్దు తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాల వరుస హిట్స్ తో సిద్దు జొన్నలగడ్డ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. హ్యాట్రిక్ హిట్ పై కన్నేసిన సిద్దు నేడు ఏప్రిల్ 10న తన జాక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Jack Movie
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. అచ్చు రాజమణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. బొమ్మరిల్లు భాస్కర్ ఫామ్ పై ఆడియన్స్ లో ఆందోళన ఉన్నప్పటికీ సిద్దు జొన్నలగడ్డ క్రేజ్ తో ఈ చిత్రానికి కాస్త బజ్ ఏర్పడింది. బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య ఈ మూవీలో సిద్దు జొన్నలగడ్డకి జోడీగా నటించింది. జాక్ చిత్ర ప్రీమియర్ షోలు ఆల్రెడీ మొదలయ్యాయి. ఈ సందర్భంగా ప్రీమియర్ షోలు చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో ఈ చిత్రానికి రెస్పాన్స్ ఇస్తున్నారు. జాక్ చిత్రానికి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది ? సిద్దు జొన్నలగడ్డ హ్యాట్రిక్ హిట్స్ కొట్టారా ? బొమ్మరిల్లు భాస్కర్ ఫామ్ లోకి వచ్చారా ? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Jack Movie
బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని స్పై యాక్షన్ కామెడీ చిత్రంగా రూపొందించారు. సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టర్ ని డైరెక్టర్ ఆసక్తికరంగా రూపొందించారు. అక్కడక్కడా టిల్లు పాత్ర ప్రభావం ఉన్నట్లు అనిపిస్తుంది. సిద్దు క్యారెక్టర్ ఒకే కానీ ఫస్ట్ హాఫ్ ఎక్కడా ఎంగేజింగ్ గా అనిపించదు. గందరగోళంగా ఉండే స్క్రీన్ ప్లే చెడగొట్టింది అని చెప్పొచ్చు.
Jack Movie
ఈ చిత్రంలో స్పై సన్నివేశాలు, కామెడీ రెండూ వర్కౌట్ కాలేదు. అక్కడక్కడా సిద్దు వన్ లైన్ డైలాగులు బాగా పేలాయి. సిద్దు తన స్టైల్ లో కామెడీ ప్రయత్నించాడు కానీ సన్నివేశాలు, డైలాగులు సరిగ్గా లేకపోవడంతో ఏమీ వర్కౌట్ కాలేదు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రంలో చేయని ప్రయత్నం అంటూ లేదు. కామెడీ, యాక్షన్, దేశభక్తి, మదర్ సెంటిమెంట్ ఇలా ప్రతి అంశాన్ని బొమ్మరిల్లు భాస్కర్ ప్రయత్నించారు. చివరికి వైష్ణవి చైతన్య, సిద్దు మధ్య రొమాంటిక్ సీన్లు కూడా వర్కౌట్ కాలేదు.
Jack Movie
స్పై ఎలిమెంట్స్ ఉన్న సన్నివేశాలు, విలన్ సన్నివేశాలు చాలా బోరింగ్ గా అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా దారుణంగా ఉన్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ చాలా కన్ఫ్యూజన్ తో ఈ చిత్ర స్క్రీన్ ప్లే నడిపించారు. సంగీత దర్శకుడి నుంచి కూడా సపోర్ట్ లేదు. బిజియం ఏమాత్రం ఆకట్టుకోలేదు.
Jack Movie
ఈ చిత్రంలో ఏదైనా పాజిటివ్ ఉందా అంటే అది సిద్దు పండించిన కొన్ని కామెడీ సీన్లు మాత్రమే. బొమ్మరిల్లు భాస్కర్ మరోసారి అవకాశం వృధా చేసుకున్నారు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ వరుస విజయాల తర్వాత సిద్దు జొన్నలగడ్డకి ఈ చిత్రంతో స్పీడ్ బ్రేకర్ పడింది అంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. మరి కలెక్షన్లు ఏమేరకు ఈ చిత్రాన్ని గట్టెక్కిస్తాయో చూడాలి.