ఇక ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ సాయి పల్లవి. శ్యామ్ సింగరాయ్ సినిమా చూసి ప్రతీ ప్రేక్షకుడు సాయి పల్లవిని, ఆమె నటనను పొగడ కుండా ఉండలేకపోతున్నారు. ఆమె నటన, డాన్స్, స్క్రీన్ ప్రజన్స్..ఇలా ప్రతీ ఎలిమెంట్ సినిమాకు బాగా ఉపయోగపడ్డాయి. ఈ సినిమాలో ముగ్గరు హీరోయిన్లు ఉన్నా.. ఆడియన్స్ ను మాత్రం బాగా ఆకట్టుకుంది సాయి పల్లవి నటనే. ఇక ఆమె డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. మరీ ముఖ్యంగా నెలరాజుని పాట ప్రేక్షకుల మనసుని తాకింది. ఈ పాటలో సాయి పల్లవి స్క్రీన్ ప్రజన్స్ ను చూసి..తెగ ముచ్చట పడిపోయారు ఆడియన్స్.