Shruti Haasan : మత్తు మత్తుగా శృతి హాసన్ ఫోజులు.. వొళ్లును విల్లులా విరుస్తూ పిచ్చెక్కిస్తోందిగా..

First Published | Nov 21, 2023, 4:10 PM IST

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది. ఇటీవల వరుసగా గ్లామర్ ఫొటోలను పంచుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మైండ్ బ్లోయింగ్ ఫోజులతో దర్శనమిచ్చింది. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ నుంచి కోలీవుడ్, టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. వరుస చిత్రాలతో అలరిస్తూనే వస్తోంది.

లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా శృతిహాసన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఎక్కడా తండ్రి ఇమేజ్ వినియోగించుకునే ప్రయత్నం చేయలేదు. తన స్వ శక్తిగా ఎదిగేందుకు కృషి చేసింది. తండ్రికి తగ్గ తనయ అనిపించింది. 


ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహా రెడ్డి’ చిత్రాలతో రెండు బ్లాక్ బాస్టర్ హిట్లను సొంతం చేసుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ సక్సెస్ లో దూసుకుపోతోంది. నెక్ట్స్ మరో భారీ ప్రాజెక్ట్ తో రాబోతుండటం విశేషం.

ఇదిలాఉంటే శృతి హాసన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గానే కనిపిస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ను అభిమానులకు అందిస్తూ వస్తోంది. మరోవైపు గ్లామర్ ఫొటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది.

శృతి హాసన్ ఇటీవల వరుస ఫొటోషూట్లతో దుమ్ములేపుతోంది. స్టన్నింగ్ గా ఫొటోలకు ఫోజులిస్తూ నెట్టింట అందాల దుమారం రేపుతోంది. కిర్రాక్ అవుట్ ఫిట్లలో ఖతర్నాక్ స్టిల్స్ ఇస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా మరిన్ని పిక్స్ ను షేర్ చేసుకుంది.

తాజాగా శృతి హాసన్ పంచుకున్న పిక్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. పూర్తిగా బ్లాక్ అవుట్ ఫిట్ లో బిగుతైన అందాలను ప్రదర్శించిందీ బ్యూటీ. స్టన్నింగ్ లుక్స్ లో మత్తు మత్తుగా ఫోజులిస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. 
 

స్టార్ హీరోయిన్ పంచుకున్న గ్లామర్ ఫోటోలను అభిమానులు క్షణాల్లోనే వైరల్ చేస్తున్నారు. అమ్మడు ఫ్యాషన్ సెన్స్ కూ ఫిదా అవుతున్నారు. మరోవైపు గ్లామర్ షోకూ మంత్రముగ్ధులవుతూ ఫొటోలకు లైక్స్, కామెంట్లు పెడుతూ మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు.

ఇక శృతి హాసన్ త్వరలో మరో భారీ బ్లాక్ బాస్టర్ ను సొంతం చేసుకునేందుకు రెడీ అవుతోంది. ప్రభాస్ (Prabhas) సరసన ‘సలార్’లో నటించిన విషయం తెలిసిందే. ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ డిసెంబర్ 22న రాబోతోంది. ఆ తర్వాత నుంచి శృతి మరింతగా బిజీ అవ్వడం ఖాయం. 

Latest Videos

click me!