సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు వింత ప్రశ్నలు,బాడీ షేమింగ్ లు, ట్రోలింగ్స్ లాంటివి కామన్. ఇలాంటి చాలా ఫేస్ చేసింది హీరోయిన్ శృతీ హాసన్. ఇక రీసెంట్ గా ఆమెకు వింత ప్రశ్న ఎదురయ్యింది. దాని తగ్గ సమాధానం కూడా చెప్పింది శృతి. ఇంతకీ శృతీ ఏం చెప్పింది...?
ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న బ్యూటీ శృతి హాసన్. పేరుకు కమల్ హాసన్ కూతురే అయినా తనకంటూ సొంత గుర్తింపును దక్కించుకున్న ఈ భామ.. తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను అందుకుంది.
28
పస్ట్ ఐరెన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న శ్రుతికి గబ్బర్ సింగ్ లైఫ్ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నా.. ఇప్పుడు శృతి మరింతగా పుంజుకుంది. దీంతో ఈ అమ్మడు చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది.
38
ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న శ్రుతి తర్వాత కొంత కాలం తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. హాలీవుడ్ లో స్టేజ్ షోలు చేసుకుంటూ గడిపేసింది. ఇక రీసెంట్ గా క్రాక్ మూవీతో మాసివ్ హిట్ అందుకుంది శృతీ.. మళ్ళీ టాలీవుడ్ లో సినిమాలు మొదలెట్టేసింది.
48
ప్రస్తుతం శృతి హాసన్ ఖాతాలో టాలీవుడ్ నుంచే మూడు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ సరసన సలార్, బాలకృష్ణ జోడీగా ఎన్‌బీకే 107, చిరంజీవి జతగా మెగా154 సినిమాల్లో నటిస్తోంది శృతీ హాసన్
58
ఒక వైపు సినిమాలతో ఫుల్ బిజిగా ఉంటూనే... వరుస సినిమాలతో అలరిస్తూనే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలతో, సినిమా అప్‌డేట్‌లతో అభిమానులకు టచ్‌లో ఉంటుంది. హాట్ హాట్ ఫోటోస్ తో కుర్రాళ్ళ గుండెల్లో గుణపాలు గుచ్చేస్తునంది బ్యూటీ.
68
ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ను నిర్వహించింది శ్రుతి హాసన్. ఈ సెషన్‌లో శ్రుతి హాసన్‌కు ఒక వింత ప్రశ్న ఎదురైంది. ఈ సెషన్‌లో ఓ నెటిజన్ శ్రుతి హాసన్‌ను మీ పెదాల సైజు ఎంత? అని అడిగాడు.
78
ఈ ప్రశ్నకు ధీటుగా స్పందించింది శ్రుతి హాసన్. లిప్ సైజ్ కూడా ఉంటుందా ? అని నెటిజన్‌ను తిరిగి ప్రశ్నించింది. అంతే కాదు.. నువ్వే కొలుచుకో అని ఒక సెల్ఫీ ఫోటో కూడా పోస్ట్ చేసింది. శ్రుతి హాసన్ రిప్లైకి నెటిజన్ బిగ్ షాక్ తగిలింది. ఇటువంటి పనీ పాటా లేని ప్రశ్నలు వేయవద్దు అని ఇండైరెక్ట్ గా శచురకలు అంటించింది శృతి.
88
శ్రుతి హాసన్ ఎపిక్ రిప్లై పట్ల సోషల్ మీడియాలో పలువురు ప్రశంసిస్తున్నారు. శ్రుతి హాస్ ఇప్పుడే కాదు గతంలో కూడా శృతీకి ఎదురయిన చాలా ప్రశ్నలకు ఇలానే డిఫరెంట్ గా సమాధానం చెప్పింది శృతీ. ఇంతకుముందు ట్రోలింగ్, బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నట్లు శ్రుతి హాసన్ చెప్పిన విషయం తెలిసిందే.