గతంలో `అదిరింది` పేరుతో జీ తెలుగులో ప్రసారం అయినా ఈ షోకి కొత్త లుక్‌ని తీసుకొచ్చారు. `బొమ్మ అదిరింది`గా టైటిల్ మార్చి, యాంకర్లని, జడ్జ్ లను మార్చి కొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. దీనికి శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరిస్తుంది. నవదీప్ స్థానంలో జానీ మాస్టర్ వచ్చారు. ఈ షో గత ఆదివారం ప్రారంభమైంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో సుమ, అలీ సందడి చేసి షోకి ఊపు తీసుకొచ్చారు.
కమెడియన్స్ శ్రమను దోచుకుంటున్నారు. వాళ్లకు సరైన ఫుడ్ కూడా పెట్టరు. వేతనాలు ఇవ్వరంటూ ఆక్రోషం వెళ్లగక్కారు. ఇక జబర్దస్త్ తనకు ఎంత మేలు చేసిందో... తన వలన షోకి కూడా మేలు జరిగిందని అన్నారు. వెళుతూ వెళుతూ జబర్దస్త్ ని కూలదోసే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా జబర్దస్త్ డైరెక్టర్స్ తో పాటు చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ వంటి కొందరు కమెడియన్స్ ని తనతోపాటు తీసుకుపోయాడు.