శృతి హాసన్ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. కెరీర్ ఆరంభంలో ఎదురైన పరాజయాల కారణంగా ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఆ ముద్రని చెరిపివేస్తూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోవడానికి శృతికి ఎక్కువ టైం పట్టలేదు.
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపంలో శృతి హాసన్ కు అదృష్టం వరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.
ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాలలో శృతి హాసన్ భాగమైంది. టాలీవుడ్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా శృతి హాసన్ ప్రేమ వ్యవహారాలు కూడా వైరల్ అయ్యాయి.
తరచుగా శృతిహాసన్ మ్యూజిక్ వీడియోలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఆమెకి నటనతో పాటు మ్యూజిక్ పిచ్చి కూడా బాగా ఎక్కువే. అలాగే విభిన్నమైన ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ కి జోడిగా పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా శృతి హాసన్ సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ సర్ప్రైజ్ చేసింది. శృతి హాసన్ మోడ్రన్ డ్రెస్సుల్లో మెరిస్తే ఎంత హాట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ట్రెండీగా ఉన్న డ్రెస్ లో శృతి హాసన్ రెచ్చిపోయింది.బ్లాక్ సారీ ధరించిన శృతి హాసన్ పైన స్టైల్ గా బ్లేజర్ ధరించింది. అయినప్పటికీ పలచని చీరలో నాగినిలా బుసలు కొడుతూ మెలికలు తిరుగుతూ అందాలు ఆరబోసింది.
కవ్వించే విధంగా శృతి హాసన్ ఇస్తున్న హావభావాలు యువత మతి చెడగొట్టేలా ఉన్నాయి. శృతి ఈ ఫోజుల్లో టూ బోల్డ్ గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
శృతి హాసన్ ప్రభాస్ సరసన సలార్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. రీసెంట్ గా శృతి హాసన్ వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో తిరుగులేని సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది.