తెలుగుతోపాటు బాలీవుడ్ లోనూ వరుస ఆఫర్లను అందుకుంటూ వచ్చింది శ్రియా. ఈ క్రమంలో సౌత్ ఆడియెన్స్ తో పాటు నార్త్ ఆడియెన్స్ ను కూడా తనవైపు తిప్పుకుంది. భారతీయ ప్రేక్షకాదరణ పొందిన హీరోయిన్లలో శ్రియా కూడా ముందు వరసలో ఉంది. ఇప్పటికీ సౌత్ సినిమాలతో పాటు నార్త్ భాషల్లో రూపొందుతున్న చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.