బర్త్ డే సెలబ్రేషన్స్.. బీచ్ లో శ్రియా శరన్ రచ్చరచ్చ.. కుర్ర హీరోయిన్ అన్నా నమ్మాల్సిందే..

First Published | Sep 19, 2023, 8:47 PM IST

స్టార్ హీరోయిన్ శ్రియా శరన్ బీచ్ లో అందాల రచ్చ చేసింది. పొట్టి దుస్తుల్లో సముద్రపు ఒడ్డున పరిగెడుతూ గ్లామర్ విందు చేసింది. మతులుపోయే ఫోజుల్లో మంత్రముగ్ధులను చేసింది. లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

స్టార్ హీరోయిన్ శ్రియా శరన్ (Shriya Saran)  గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో వెలుగొందిన ఈ సీనియర్ బ్యూటీ అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. సౌత్ తో పాటు నార్త్ లోనూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 
 

శ్రియా శరన్ కెరీర్ టాలీవుడ్ చిత్రాలతోనే ప్రారంభమైంది. 2001లో వచ్చిన ‘ఇష్టం’ చిత్రంతో నటిగా వెండితెరపై తొలిసారిగా నటించింది. ‘సంతోషం’ చిత్రంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. అప్పటి నుంచే టాలీవుడ్ లో ఈ బ్యూటీ క్రేజ్ మొదలైంది. 


ఇప్పటి వరకు 22 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లోని అగ్రస్థాయి తారల సరసన నటించింది. బడా హీరోలకు ధీటుగా నటించి మెప్పించింది. ప్రేక్షకులనూ తన నటన, అందంతో ఆకట్టుకుంది. ఇప్పటికీ వరుస చిత్రాలతో అలరిస్తోంది. 
 

19 మార్చి 2018న తన రష్యన్ ప్రియుడు ఆండ్రీ కొస్చీవ్‌ను వివాహం చేసుకుంది. రెండేళ్ల కింద 10 జనవరి 2021న  పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత కాస్తా సినిమాల జోరు తగ్గించింది. ఎక్కువ సమయం ఫ్యామిలీతో గడిపేందుకు కేటాయిస్తోంది.

ఈ క్రమంలో శ్రియా భర్త, కూతురుతో వరుసగా వెకేషన్లు, టూర్లకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా అందిస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలనూ షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది. తన ఫ్యామిలీ, వ్యక్తిగత విషయాలపై అప్డేట్ ఇస్తూ వస్తోంది. 
 

ఇక రీసెంట్ గా సెప్టెంబర్ 11న శ్రియా శరన్ పుట్టిన రోజు కావడం విశేషం. ఈ సందర్భంగా తన భర్త, కూతురుతో కలిసి వెకేషన్ కు వెళ్లింది. బహుశా ఫారేన్ లో బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా అప్పటి వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను పంచుకుంది.

బీచ్ లో రచ్చ చేస్తూ.. బ్యూటీఫుల్ గ్రీనరీలో తిరుతూ కనిపించింది. లేటెస్ట్ గా శ్రియా పంచుకున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. బీచ్ లో సీనియర్ బ్యూటీ పొట్టి దుస్తుల్లో మెరిసింది. థైస్ అందాలతో మైమరిపించింది. మరోవైపు ఫిట్ నెస్ తో ఆకట్టుకుంది. మరో అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ గా మెరిసింది. 
 

నాలుగు పదుల వయస్సు దాటినా నాజుకూ అందాలతో మతులు చెడగొట్టింది. ఫిట్ నెస్ తో కుర్రాళ్లనే మైమరిపిస్తోంది. శ్రియా స్లిమ్ ఫిట్ అందాలు చూస్తే కుర్ర హీరోయిన్ అన్నా నమ్మేలా చేస్తోంది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. చివరిగా శ్రియా ‘దృశ్యం2’, ‘కబ్జా’, ‘మ్యూజిక్ స్కూల్’ చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం ‘నరగసూరన్’లో నటిస్తోంది.
 

Latest Videos

click me!