పైట జరిపి క్లీవేజ్‌ షోతో మెంటల్‌ ఎక్కిస్తున్న శ్రియా.. గోల్డ్ కలర్‌ శారీలో చిలిపి పోజులతో టెంప్టింగ్‌

Published : Sep 02, 2023, 03:54 PM ISTUpdated : Sep 02, 2023, 09:43 PM IST

హాట్‌ హీరోయిన్‌ శ్రియా శరణ్‌ టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఆమె అనేక సూపర్‌ హిట్‌ చిత్రాలు చేసింది. సీనియర్‌ హీరోల నుంచి యంగ్‌ హీరోల వరకు జోడీ కట్టి అదరగొట్టింది.   

PREV
112
పైట జరిపి క్లీవేజ్‌ షోతో మెంటల్‌ ఎక్కిస్తున్న శ్రియా.. గోల్డ్ కలర్‌ శారీలో చిలిపి పోజులతో టెంప్టింగ్‌

శ్రియా శరణ్‌(Shriya Saran) సెకండ్‌ ఇన్నింగ్స్ లో భారీ చిత్రాల్లో భాగమయ్యింది. వరుస విజయాలు అందుకుంది. ఆమె గతేడాది `ఆర్‌ఆర్‌ఆర్‌`, `దృశ్యం2` చిత్రాల్లో భాగమైన విషయం తెలిసిందే. ఈ రెండూ భారీ హిట్లు అయ్యాయి. `దృశ్యం2` ఆమెకి బిగ్‌ కమ్‌ బ్యాక్‌గా నిలిచింది. దీంతో ఆమె తన అందాల ఘాటు కూడా పెంచింది. అందాల డోస్‌ పెంచుతూ దుమ్మురేపుతుంది. ట్రెండీ వేర్‌లో, ట్రెడిషనల్‌ లుక్‌లో,.. ఇలా దుస్తులేవైనా ఆమె హాట్‌గా కనిపిస్తూ పిచ్చెక్కిస్తుంది. పిచ్చెక్కించే అందాల విందుతో దుమారం రేపుతుంది. 
 

212

తాజాగా శ్రియా శరణ్‌.. గోల్డ్ శారీలో మెరిసింది. క్లీవేజ్‌ అందాలు చూపిస్తూ మత్తెక్కిస్తుంది. పరువాలు కనిపించేలా పైట కొంగు జరిపి కుర్రకారుని రెచ్చగొడుతుంది. వయ్యారంగా పోజులిస్తూ సెగలు రేపుతుంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వరుస సిరీస్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

312

శ్రియా(Shriya) శరణ్‌ మరోవైపు స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో హోయలు పోయింది. ఇందులో సిల్వర్‌ కలర్‌ శారీలోమెరిసింది. పరువాల జోరు చూపిస్తూ మరింతగా టెంప్ట్ చేస్తుంది. ఈ లేటెస్ట్ ఫోటో షూట్‌ సిరీస్‌ సైతం కుర్రాళ్లని మైండ్ బ్లాక్‌ చేస్తుంది. నెట్టింట రచ్చ చేస్తున్నాయి.
 

412

శ్రియా పదేళ్లపాటు టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. 2001లో ఈ బ్యూటీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.2010 వరకు ఫుల్‌ బిజీగా సినిమాలు చేసింది. ఏడాదికి నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది. ఆ సమయంలో టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిందనే చెప్పాలి.  `ఇష్టం` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైన ఈ బ్యూటీ తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. ఆ తర్వాత నాగార్జునతో `సంతోషం` సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది. పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. అదే ఏడాది బాలయ్యతో `చెన్నకేశవ రెడ్డి` చిత్రంతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. 
 

512

ఇక తరుణ్‌తో `నువ్వే నువ్వే` చిత్రంలో నటించింది. శ్రియా చేసిన తొలి ప్రాపర్‌ లవ్‌ స్టోరీ ఇది. పెద్ద విజయం సాధించింది. ఈ టైమ్‌లోనే బాలీవుడ్‌ ప్రయత్నాలు చేసింది. అక్కడ `తుజే మేరి కసమ్‌` చిత్రంలో మెరిసింది. అంతే మళ్లీ బాలీవుడ్‌ వైపు చూడలేదు. తెలుగులో ఆమెకి వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో బాలీవుడ్‌ ని లైట్‌ తీసుకుంది. 
 

612

`నీకు నేను నాకు నువ్వు`, `ఠాగూర్‌`, `ఎలా చెప్పను` చిత్రాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌ విజయాలు సొంతం చేసుకుంది. `ఠాకూర్‌` ఈ బ్యూటీకి స్టార్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చింది. `నీ మనసు నాకు తెలుసు`, `నేనున్నాను`, `అర్జున్‌`, `బాలు`, `నా అల్లుడు`, `సదా మీ సేవలో`, `సోగ్గాడు`, `సుభాష్‌ చంద్రబోస్‌`, `మొగుడు పెళ్లం ఓ దొంగోడు`, `చత్రపతి`, `భగీరథ`చిత్రాల్లో మెరిసింది. 
 

712

బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్‌, ప్రభాస్‌, మహేష్‌బాబు, పవన్‌ కళ్యాణ్‌, రవితేజ, ఎన్టీఆర్‌, తరుణ్‌లతో కలిసి నటించింది.  తరుణ్‌, శ్రియాది హిట్‌ కాంబినేషన్‌గా నిలిచింది. వీరిద్దరులు నాలుగైదు సినిమాలు చేశారు. 
 

812

వీటితోపాటు `బొమ్మలాట`, `దేవదాసు`, `గేమ్‌`, `బాస్‌` చిత్రాల్లో స్పెషల్‌ అప్పీయరెన్స్ చేసింది. అలా కాసేపు మెరిసింది. `మున్నా` చిత్రంలో ఏకంగా ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. `చమ్మక్కురో` పాటలో అందాల విందుతో ఊపేసింది. `తులసి`లోనూ మరోసారి స్పెషల్‌ సాంగ్‌ చేసింది. ఇలా వరుసగా తెలుగు, తమిళంలో ఐటెమ్‌ సాంగ్‌లు వరుసగా వచ్చాయి. ఇది ఈ బ్యూటీకి మెయిన్‌ హీరోయిన్‌ పాత్రలపై దెబ్బ పడేలా చేసింది. 
 

912

పెద్ద సినిమా ఆఫర్లు తగ్గాయి. మిడిల్‌ రేంజ్‌ సినిమాలు, చిన్న బడ్జెట్‌ చిత్రాలే వచ్చాయి. క్రమంలో ఈ బ్యూటీ క్రేజ్‌ తగ్గుతూ వచ్చింది. ఇతర హీరోయిన్లు రావడం కూడా ఈ అమ్మడిపై ప్రభావాన్ని చూపించిందని చెప్పొచ్చు. అయినా `పిస్తా`, `డాన్‌ శీను`, `పులి`, `నువ్వా నేనా`, `లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌` చిత్రాల్లో నటించి మెప్పించింది.
 

1012

`పవిత్ర` వంటి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం కూడా చేసింది. ఇందులో అద్భతంగా చేసి మెప్పించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలు కూడా చేస్తూ అన్ని భాషల్లోకి వెళ్లింది. తెలుగులో ఆఫర్లు తగ్గడానికి ఇవి కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. 
 

1112

`మనం`, `గౌతమిపుత్ర శాతకర్ణి`, `గోపాలగోపాల`, `పైసా వసూల్‌`, `గాయత్రి`, `వీరభోగ వసంత రాయలు`, `గమనం`, `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రాలతో మెరిసింది శ్రియా. చివరగా ఆమె `మ్యూజిక్‌ స్కూల్‌` చిత్రంలో నటించింది. ఇది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 
 

1212

శ్రియా మధ్యలో పెళ్లికి సంబంధించిన గ్యాప్‌ తీసుకుంది. ఆమె రష్యాకి చెందిన పాపులర్‌ ఫోటోగ్రాఫర్‌ని పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు రాధా ఉన్నారు. పాపే ప్రాణంగా బతికేస్తుంది శ్రియా. అయితే `దృశ్యం2` పెద్ద హిట్‌ కావడంతో ఈ అమ్మడికి ఇక వరుసగా ఆఫర్లు వస్తాయని భావించారు. కానీ సీన్‌ రివర్స్ అయ్యింది. ఇప్పుడు ఒక్క ఆఫర్‌ కూడా లేదు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories