నువ్వొక పూజకు పనికిరాని పువ్వు, ఛీ ఇంత వల్గర్ గానా.. బిగ్ బాస్ జెస్సీపై బోల్డ్ హీరోయిన్ కామెంట్స్

Published : Apr 20, 2023, 08:23 PM IST

అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో పాటు, నవ్వులు పూయిస్తూ వినోదాన్ని అందించే షో ఢీ. ప్రస్తుతం ఢీ 15 కొనసాగుతోంది. ఈ షోలో శేఖర్ మాస్టర్, బోల్డ్ హీరోయిన్ శ్రద్దా దాస్ జడ్జీలుగా వ్యవహారిస్తున్నారు.

PREV
16
నువ్వొక పూజకు పనికిరాని పువ్వు, ఛీ ఇంత వల్గర్ గానా.. బిగ్ బాస్ జెస్సీపై బోల్డ్ హీరోయిన్ కామెంట్స్

అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో పాటు, నవ్వులు పూయిస్తూ వినోదాన్ని అందించే షో ఢీ. ప్రస్తుతం ఢీ 15 కొనసాగుతోంది. ఈ షోలో శేఖర్ మాస్టర్, బోల్డ్ హీరోయిన్ శ్రద్దా దాస్ జడ్జీలుగా వ్యవహారిస్తున్నారు. ఇక యాంకర్ ప్రదీప్, బిగ్ బాస్ జెస్సీ, యంగ్ యాంకర్ దివ్య నార్ని ఈ షోలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. 

26

తాజాగా నిర్వాహకులు ఏప్రిల్ 26న ప్రసారం అయ్యే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ప్రోమోలో అందరు బిగ్ బాస్ జెస్సీని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. సరదాకి ఆ కామెంట్స్ చేసినప్పటికీ అంత వల్గర్ గా అందరి ముందు ఒక వ్యక్తి పరువు తీయడం ఏంటనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. 

36

అసలు ప్రోమోలో ఉన్న మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎప్పటిలాగే ఆకట్టుకునే డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో ఈ ఎపిసోడ్ సిద్ధం అయినట్లు ఉంది. ఇంతలో బిగ్ బాస్ జెస్సీ యాంకర్ దివ్యని ఫ్లటింగ్ చేస్తూ ఎంట్రీ ఇస్తాడు. దివ్యకి బాగా చలిగా ఉందట.. వెచ్చదనం ఇవ్వడం కోసం ఆమెకి దగ్గరగా ఉన్నానని జెస్సీ ఫన్నీగా సమాధానం ఇస్తాడు. 

46

దీనిపై శేఖర్ మాస్టర్ స్పందిస్తూ.. ఆమెకి వెచ్చదనం రావాలంటే ముందు మనలో వేడి ఉండాలి కదా అబ్బా అని బదులిస్తాడు. దీనితో జెస్సీ పరువు పోయినట్లు అవుతుంది. వేంటనే ప్రదీప్ మాట్లాడుతూ..  ఆరుగురు పతివ్రతలు సినిమాలో ఒకాయన కూర్చుని ఏడుస్తుంటాడు.. నువ్వు ఆ టైపా అని అంటాడు. ఏమనుకుంటున్నారు నా గురించి.. నేనేంటో మీకు తెలియదు అని గంభీరంగా అంటాడు జెస్సీ. 

56

నాకు తెలుసు అని శ్రద్దా దాస్ అందుకుంటుంది.. ఆ చెప్పండి అని జెస్సీ ఆమె నుంచి ప్రశంసలు పొందేందుకు ఎగ్జైట్ అవుతాడు. కానీ శ్రద్దా మాత్రం.. నువ్వు పూజకి పనికిరాని పువ్వు అట కదా అంటూ వల్గర్ గా జెస్సీపై జోకు వేస్తుంది. 

66

దీనితో జెస్సీ తన ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడతాడు. సెటైర్లు వేయొచ్చు కానీ అందరి ముందు ఇలా ఒక వ్యక్తిపై వల్గర్ కామెంట్స్ చేయడం ఏంటి అని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. జెస్సీ బిగ్ బాస్ 5 సీజన్ లో మంచి వాడిగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు బుల్లితెరపై పలు షోలలో మెరుస్తున్నాడు. 

click me!

Recommended Stories