అలాగే మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్, సుడిగాలి సుధీర్ మధ్య అదే యూట్యూబర్ మరో పోల్ నిర్వహించాడు. ఆ పోల్ నందు వైష్ణవ్ తేజ్-కృతి శెట్టి, సుడిగాలి సుధీర్-రష్మీ జోడిలలో ఏ జోడీ మీకు ఇష్టం? అని పోల్ నిర్వహించాడు. ఈ పోల్ నందు కూడా సుడిగాలి సుధీర్ దే పై చేయి అయ్యింది. 29 వేల మంది పాల్గొన్న ఈ పోల్ లో 84 శాతం సుదీర్ కి అనుకూలంగా ఓట్లు వేశారు.