పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ దంపతులుగా విడిపోయిన సంగతి తెలిసిందే. కానీ పిల్లల కోసం తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. పవన్, రేణుదేశాయ్ ఇద్దరికీ తమ పిల్లలు అకీరా, ఆద్య అంటే అమితమైన ప్రేమ.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ దంపతులుగా విడిపోయిన సంగతి తెలిసిందే. కానీ పిల్లల కోసం తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. పవన్, రేణుదేశాయ్ ఇద్దరికీ తమ పిల్లలు అకీరా, ఆద్య అంటే అమితమైన ప్రేమ. అందుకే పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లలకు సమయం కేటాయిస్తుంటారు.
26
ఇటీవల పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ఇద్దరూ అకీరా నందన్ చదువుకునే స్కూల్ లో గ్రాడ్యుయేషన్ డేకి హాజరయ్యారు. పవన్ కళ్యాణ్, అకీరా, రేణు దేశాయ్, ఆద్య కలసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
36
చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్, అకీరా, రేణు దేశాయ్ ఒకే ప్రేములో కనిపించడంతో మెగా ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్కూల్ లో అకీరా నందన్ ఆర్ఆర్ఆర్ చిత్రంలోని దోస్తీ సాంగ్ పై పియానో ప్లే చేసి ఆకట్టుకున్నాడు. ఇలా అకీరా నందన్ గ్రాడ్యుయోషన్ డే చాలా సంతోషంగా సాగింది.
46
అయితే అకీరా గురించి ఒక రూమర్ వైరల్ గా మారింది. మెగా అభిమానులంతా అకీరాని అకీరా నందన్ కొణిదెల అనే పిలుస్తున్నారు. కానీ గ్రాడ్యుయేషన్ డేలో అకీరా తన 'కొణిదెల' సర్ నేమ్ ని తొలగించినట్లు రూమర్స్ వస్తున్నాయి. గ్రాడ్యుయేషన్ డేలో అకీరా పేరు అకీరా నందన్ దేశాయ్ అని డిస్ ప్లే అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనేది క్లారిటీ లేదు.
56
తన తల్లిపై ప్రేమతోనే అకీరా ఇలా తన పేరులో దేశాయ్ అని పెట్టుకుని కొణిదెల డ్రాప్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే మెగా ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. కానీ తన పేరు ఎలా ఉండాలనేది పూర్తిగా అకీరాకి సంబంధించిన విషయం.
66
మొత్తంగా అకీరా స్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంతో రేణు దేశాయ్ సంతోషంలో మునిగిపోతోంది. ఇకపై అకీరా కొత్త లైఫ్ మొదలు కాబోతోంది అంటూ రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.