అతిగా జిమ్ వర్కౌట్స్, డిప్రెషన్.. సమంత చేజేతులా ఆరోగ్యం పాడు చేసుకుందా ?

First Published Oct 30, 2022, 9:01 AM IST

సమంత సోషల్ మీడియాలో తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించగానే చిత్ర పరిశ్రమ ఒక్క సరిగా ఉలిక్కి పడింది. అభిమానులు షాక్ లో ఉన్నారు. ఆమె ప్రస్తుతం మయోసైటిస్ అనే ప్రమాదకర ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతోంది.

సమంత సోషల్ మీడియాలో తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించగానే చిత్ర పరిశ్రమ ఒక్క సరిగా ఉలిక్కి పడింది. అభిమానులు షాక్ లో ఉన్నారు. ఆమె ప్రస్తుతం మయోసైటిస్ అనే ప్రమాదకర ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతోంది. సమంత దాదాపుగా కోలుకోవడం ఊరటనిచ్చే అంశం. మరికొన్ని రోజుల్లో పూర్తిగా కోలుకుంటానని విశ్వాసం వ్యక్తం చేసింది. 

దీనితో అభిమానులు, స్నేహితులు, సెలెబ్రిటీలు అంతా సమంత స్పీడ్ గా రికవరీ కావాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుత కాలంలో మనుషులకు ఎలాంటి వ్యాధులైన సోకవచ్చు. కొన్ని సార్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ సమంత హెల్త్ విషయంలో ఎంతో కేరింగ్ గా ఉంటుంది. ఆమెకి ఇలా భయంకర వ్యాధి ఎలా సోకింది అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

దీనిపై అనేక ప్రచారాలు మొదలయ్యాయి. మయోసైటిస్ అనేది కండరాలకు సంబంధించిన వ్యాధి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కండరాలు బలహీన పడడం, ఫలితంగా నీరసం, చర్మానికి ఇన్ఫెక్షన్ సోకడం లాంటి లక్షణాలు ఉంటాయి. చాలా కఠిన పరిస్థితుల మధ్య ఈ వ్యాధితో పోరాడాల్సి ఉంటుంది. అందుకే సమంత అంత ఎమోషనల్ గా తన వ్యాధి గురించి చెప్పుకొచ్చింది. 

ఈ వ్యాధి సోకడానికి ఖచ్చితమైన కారణాలు లేవు. కానీ ఆల్కహాల్ సేవించడం, డ్రగ్స్ వాడకం వల్ల కూడా ఆటో ఇమ్యూన్ లక్షణాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే సమంత నాగచైతన్యతో బ్రేకప్ తర్వాత విపరీతమైన ఒత్తిడి తీసుకుంది. వెంటనే తన సినిమాల కోసం జిమ్ లో ఎక్కువగా వర్కౌట్స్ చేసింది. 

యశోద చిత్రంలో యాక్షన్ సీన్స్ లో నటించింది. అలాగే వరుణ్ ధావన్ తో నటిస్తున్న వెబ్ సిరీస్ లో కూడా యాక్షన్ సీన్స్ కి ట్రైనింగ్ తీసుకుంటోంది అని వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ సమంత ఆరోగ్యంపై ఏమైనా ప్రభావం చూపాయా అనే కోణంలో కూడా అభిమానుల మధ్య చర్చ జరుగుతుంది. 

భారీగా వర్కౌట్స్ చేయడం, వెంటనే యాక్షన్ సీన్స్ చేయడం వల్ల కండరాలపై ప్రభావం ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడు సమంత బాధపడుతోంది కండరాలకు సంబంధించిన వ్యాధితోనే. ఏది ఏమైనా లైఫ్ స్టైల్ మార్చుకుని, ఆహారం, విశ్రాంతి తీసుకుంటే ఈ వ్యాధి నుంచి బయట పడవచ్చు అని సూచిస్తున్నారు. 

click me!