బెంజ్ కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ హమీద, శ్రీరామచంద్ర తో రైడ్ ఎప్పుడంటున్న నెటిజన్లు

Published : Oct 30, 2022, 08:49 AM ISTUpdated : Oct 30, 2022, 08:53 AM IST

ఈ మధ్య  బుల్లితెర స్టార్స్.. వెండితెర స్టార్స్ ను మించిపోతున్నారు.  వాళ్లను మించి సంపాదిస్తున్నారు. లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. లగ్జరీ కార్లు కొంటున్నారు. రీసెంట్ గా బుల్లి తెర బ్యూటీ హమీదా కాస్ట్లీ కార్ ను సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ కార్ రేటెంత. 

PREV
15
బెంజ్ కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ హమీద, శ్రీరామచంద్ర తో రైడ్ ఎప్పుడంటున్న నెటిజన్లు

ఈ మధ్య వెండి తెర స్టార్స్ కంటే కూడా బుల్లి తెర స్టార్స్ ఎక్కువగా లగ్జరీ లైఫ్ నులీడ్ చేస్తున్నారు. అందులో భాగంగా..లగ్జరీ కార్లు కూడా కొనుగొలు చేస్తున్నారు. ఆమధ్య బిగ్ బాస్ బ్యూటీ హిమజ కూడా లక్షలు విలువ చేసిన కారును సొంతం చేసుకోగా.. ఇప్పుడు మరో బిగ్ బాస్ కంటస్టెంట్  హమీద కూడా లగ్జరీ కారు ను సొంతం చేసుకుంది. దీపావళి సందర్భంగా  హమీద మెర్సిడెస్‌ బెంజ్‌ కారును కొనుగోలు చేసింది.ఈ మోడల్‌ కారు ధర .50 లక్షలకు పైగానే ఉంటుంది.

25

తన కొత్త కారు గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హమీదా..కొన్న వెంటనే తన పేరెంట్స్ మరియు తోటి కంటెస్టెంట్  యాంకర్‌ రవి, అతని భార్య నిత్య సక్సేనాతో జాలీగా ఓ రైడ్‌ కూడా వెళ్లింది. వీటికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఇది చూసిన నెటిజన్లు. హమీద ఫ్యాన్స్‌ ఆమెను విష్ చేస్తూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.  

35

ఇక అందరూ అనుకున్నట్టుగానే హమీదా పోస్టుకు సింగర్‌ శ్రీరామ్‌ కూడా స్పందించాడు. కంగ్రాట్స్‌ అంటూ కామెంట్‌ పెట్టాడు. దీనికి థ్యాంక్యూ అంటూ హమీదా రిప్లై ఇచ్చింది. ఈ క్రమంలో శ్రీరామ్‌తో డ్రైవ్‌కు ఎప్పుడు వెళ్తావ్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయంలో మాత్రం ఇద్దరు స్పందించలేదు. 
 

45

సాహసం చేయరా ఢింబకా సినిమాతో తెలుగు తెరపై హీరోయిన్ గా మెరిసింది హమీద.  తెలుగుతో పాటు తమిళంలో ఒక సినిమాలోనూ చేసింది. కానీ  హమీదాకు ఇండస్ట్రీలో పెద్దగా  గుర్తింపు దక్కలేదు. ఈ క్రమంలో హమీదాకు బిగ్ బాస్ సీజన్ 5  లో అవకాశం వచ్చింది.  బిగ్‌బాస్‌ షోతో కాస్త ఫేమస్ అయ్యింది హమీదా. బిగ్ బాస్  ఆమె జీవితాన్నే మార్చేసింది.  కొత్త గుర్తింపును ఇచ్చింది. 

55

ఇక బిగ్ బాస్ సీజన్‌ 5లో సింగర్‌ శ్రీరామ చంద్రతో హమీదా నడిపిన లవ్‌ ట్రాక్‌ ఆమెకు కాస్త  పాపులర్‌ చేసింది. యాంకర్‌ రవితో కలిసి ఆ షోలో రచ్చ చేసింది. అందుకే ఆ సీజన్‌ అయిపోయిన తరువాత కూడా ఓటీటీలో ప్రసారం అయిన బిగ్ బాస్  నాన్‌స్టాప్‌లో కూడా అవకాశం దక్కించుకుంది. అక్కడ కూడా రచ్చ రచ్చ చేసింది బ్యూటీ. ఇక ఈరెండు సీజన్లలో మధ్యలోనే బయటకు వచ్చేసింది హమీద. 

click me!

Recommended Stories