Poorna: షాక్... కాబోయేవాడిని పరిచయం చేసిన పూర్ణ... ఇంతకు ఎవరీ అసిఫ్ అలీ?

Published : Jun 01, 2022, 11:25 AM IST

హీరోయిన్ పూర్ణ అందరికీ సడన్ షాక్ ఇచ్చారు. కాబోయేవాడిని పరిచయం చేసి ఝలక్ ఇచ్చారు. చడీ చప్పుడు లేకుండా ఆమె చేసిన ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. 

PREV
17
Poorna: షాక్... కాబోయేవాడిని పరిచయం చేసిన పూర్ణ... ఇంతకు ఎవరీ అసిఫ్ అలీ?
Poorna


మలయాళ భామ పూర్ణ కెరీర్ మొదలై చాలా కాలం అవుతుంది. నటిగా 2004లో ఆమె కెరీర్ మొదలైంది.  2007లో విడుదలైన మహాలక్ష్మీ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆమెకు సీమ టపాకాయ్ మూవీ గుర్తింపు తెచ్చింది. 2011లో విడుదలైన ఈ కామెడీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 

27

తర్వాత రవిబాబు హారర్ సిరీస్ అవును, అవును 2లో నటించారు. అందంతో పాటు మంచి అభినయం ఉన్న పూర్ణకు కాలం కలిసిరాలేదు. కొన్ని హిట్స్ దక్కినప్పటికీ స్టార్ హీరోయిన్ హోదా పొందలేకపోయారు. 
 

37

హీరోయిన్ గా దాదాపు కెరీర్ ముగిసింది. దీనితో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. స్టార్ హీరోల చిత్రాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు. అలాగే అడపాదడపా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. డిజిటల్ ఫార్మాట్ లో ఆమెకు కొన్ని అవకాశాలు దక్కుతున్నాయి. 
 

47

మరోవైపు బుల్లితెరపై సందడి చేస్తున్నారు. పలు టెలివిజన్ కార్యక్రమాల్లో జడ్జిగా, యాంకర్ గా కనువిందు చేస్తున్నారు. ఢీ సీజన్ 13లో పూర్ణ జడ్జిగా వ్యవహరించిన విషయం తెల్సిందే. కానీ లేటెస్ట్ సీజన్ నుండి ఆమె తప్పుకున్నారు. ప్రస్తుతం ఆమె కెరీర్ కి ఢోకా ఏమీ లేదు. అంది వచ్చిన ఆఫర్స్ చేసుకుంటూ పోతున్నారు. 
 

57


ఇక 32 రెండేళ్ల పూర్ణ పెళ్ళికి సిద్ధం అయ్యారు. తన భాగస్వామిని పరిచయం చేశారు. కుటుంబ సభ్యుల దీవెనలతో జీవితంలో తదుపరి అంకంలోకి ప్రవేశించాను. షానిద్ అసిఫ్ అలీ తో ఎంగేజ్మెంట్ జరిగింది, అని పూర్ణ కామెంట్ పెట్టారు. రింగ్ ఎమోజీ పోస్ట్ చేయడంతో వారికి ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తుంది . 
 

67
Poorna

ఇక ఇంతకీ ఎవరీ అసిఫ్ అలీ అని ఆరా తీయగా.. ఈయన ఓ బిజినెస్ మాన్. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ మరియు సీఈఓ. కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి అని తెలుస్తుంది. ఇక ఇది కుటుంబ సభ్యులు నిర్ణయించిన వివాహమా? లేక ప్రేమ వివాహమా? అనేది తెలియాల్సి ఉంది.

77
Poorna

ఇక పూర్ణ కాబోయేవాడిని పరిచయం చేయడంతో అభిమానులు, సన్నిహితులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. వారి జంట ముచ్చటగా ఉందని కితాబు ఇస్తున్నారు. ప్రస్తుతం పూర్ణ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది. 
 

click me!

Recommended Stories