ఇద్దరికీ మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత వైరం... ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ తీసిన సినిమాలు ఇవే!

Published : Nov 15, 2022, 06:49 AM IST

ఎన్టీఆర్-కృష్ణ అతిపెద్ద మాస్ హీరోలుగా తెలుగు తెరను ఏలారు. టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే అపురూప విజయాలు అందించారు. కలిసి మల్టీస్టారర్స్ చేశారు. మరి వీరిద్దరి మధ్య అంత పెద్ద అగాథం ఎందుకు ఏర్పడింది? ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ సినిమాలు నిర్మించడానికి కారణం ఏమిటీ?

PREV
17
ఇద్దరికీ మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత వైరం... ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ తీసిన సినిమాలు ఇవే!
Super Star Krishna

1983లో ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ సీఎం పీఠం అధిరోహించారు. ఆ తర్వాత కృష్ణ వరుసగా ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ సినిమాలు చేశారు. ఆయన ప్రజానేత కాదని చెప్పే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ జీవితంలోని చీకటి రహస్యాలు ఇవేనంటూ బయటపెట్టాలని చూశారు.  వాస్తవం ఏదైనా ఎన్టీఆర్ అసలు క్యారెక్టర్ ఇదంటూ కృష్ణ తూర్పారబట్టారు. ఎన్టీఆర్ తో కృష్ణకు ఏర్పడిన విబేధాలే దీనికి కారణం అంటారు. అల్లూరి సీతారామరాజు ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ కాగా... ఆయన బయోపిక్  చేసిన కృష్ణ ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. వీరిద్దరి గొడవకు పునాది పడింది అక్కడే అంటారు. మరొక కారణం కృష్ణ కాంగ్రెస్ లో చేరడం. రాజీవ్ గాంధీ పిలుపు మేరకు కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీలో ఎన్టీఆర్ విధి విధానాల పట్ల అసంతృప్తిగా ఉన్న రాజీవ్ గాంధీ ఆదేశాల మేరకు కృష్ణ ఎన్టీఆర్ ని దెబ్బతీసేందుకు అలాంటి సినిమాలు చేశారనే వాదన కూడా ఉంది. మరి ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ చేసిన సినిమాలు ఏంటో చూద్దాం.. 
 

27
Super Star Krishna

1986లో కృష్ణ దర్శకత్వంలో సింహాసనం మూవీ విడుదలైంది. కృష్ణ డ్యూయల్ రోల్ చేసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీలో కైకాల సత్యనారాయణ రాజగురువు పాత్ర చేశారు. సత్యనారాయణ లుక్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ధరించిన కాషాయ వస్త్రధారణ లుక్ లా ఉంటుంది. అలాగే ఈ మూవీలో సత్యనారాయణ చేత ఎన్టీఆర్ తరచుగా చెప్పే... 'ఏముంది నా దగ్గర బూడిద' అనే డైలాగ్ చెప్పించారు. సింహాసనం మూవీలో కైకాల సత్యనారాయణది నెగిటివ్ రోల్. 
 

37
Super Star Krishna


తర్వాత అదే ఏడాది 'నా పిలుపే ప్రభంజనం' మూవీ చేశారు కృష్ణ. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోలిన పాత్ర కైకాల సత్యనారాయణ చేశారు. ఈ మూవీలోని కీలక పొలిటికల్ డైలాగ్స్ ని కృష్ణ దర్శకుడు దాసరి నారాయణ చేత రాయించారట. అయితే ఆయన పేరు క్రెడిట్స్ లో వేయలేదు. నా పిలుపే ప్రభంజనం ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా తీసిన సినిమా అని తెలిసి అభిమానులు రాద్ధాంతం చేసే ప్రయత్నం చేశారు. అయితే వివాదం సినిమాకు మరింత హైప్ తెస్తుందని ఎన్టీఆర్ వారిని వారించాడట. నా పిలుపే ప్రభంజనం మంచి సక్సెస్ అందుకుంది. కేంద్రం మద్దతుతో సినిమాను బ్యాన్ చేయాలని మాత్రం చూశారట ఎన్టీఆర్.  

47
Super Star Krishna

కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలో సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డి దర్శకుడిగా మండలాధీశుడు మూవీ తెరకెక్కించారు. మండలాధీశుడు మూవీలో కోటా శ్రీనివాసరావు అచ్చు ఎన్టీఆర్ ని పోలిన గెటప్ లో ఉంటారు. ఆయనది పూర్తి నెగిటివ్ రోల్. భానుమతి ఈ చిత్రంలో కీలక రోల్ చేశారు. ఈ సినిమా చేసినందుకు కోటా శ్రీనివాసరావు ఆఫర్స్ కోల్పోయారు. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పలు సందర్భాల్లో దాడికి ప్రయత్నం చేశారు.

57
Super Star Krishna

ఎన్టీఆర్ పై కృష్ణ సంధించిన మరొక పొలిటికల్ థ్రిల్లర్ సాహసమే నా ఊపిరి. ఈ చిత్రానికి కృష్ణ భార్య విజయనిర్మల డైరెక్టర్. నరేష్ కీలక రోల్ చేశారు. ఈ మూవీలో ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ అనేక పొలిటికల్ సెటైర్స్, విమర్శనాస్త్రాలు ఉంటాయి. 
 

67
Super Star Krishna

ఇక గండిపేట రహస్యం మూవీలో ఎన్టీఆర్ ని ఏకిపారేశారు. నరేష్ హీరోగా నటించిన ఈ మూవీలో విజయ నిర్మల కీలక రోల్ చేశారు. 30 ఇయర్స్ పృథ్వి అచ్చు ఎన్టీఆర్ ని పోలిన గెటప్ లో నెగిటివ్ రోల్ చేశారు. ఈ చిత్రానికి నటుడు ప్రభాకర్ రెడ్డి దర్శకుడు. ఇంకా కృష్ణ నటించిన అనేక చిత్రాల్లో ఎన్టీఆర్ పాలిటిక్స్ పై ఆయన సెటైర్స్ పేల్చారు. 
 

77
Super Star Krishna

అనూహ్యంగా కృష్ణ చేసిన ఒక సినిమా ఎన్టీఆర్ కి రాజకీయంగా మేలు చేసింది. ఈనాడు టైటిల్ తో కృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో కాంగ్రెస్ విధానాలను తప్పుబట్టారు. 182 లో ఈనాడు విడుదల కాగా 1983 ఎన్నికల్లో గెలిచి ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు.  
 

click me!

Recommended Stories