మరొకవైపు శోభ,నిరుపమ్(Nirupam)ఏదో ఒకటి డెసిషన్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి స్వప్న వస్తుంది. అప్పుడు శోభ, నేను కూడా మోనిత లాగా మెడలో తాళిబొట్టు కట్టుకుంటాను అని అంటుంది. అప్పుడు స్వప్న నేనంటే ఏంటో చూపిస్తాను ఒక రెండు రోజులు ఆగు అని శోభ కి నచ్చచెబుతుంది. మరొకవైపు హిమ,నిరుపమ్ విషయం గురించి ఆలోచిస్తూ ఎందుకు బావ ఇంటికి వచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే హిమ, సౌందర్య(soundarya)కి ఫోన్ చేసి ఆనంద్ రాని హాస్పిటల్ కి పిలుచుకొని రమ్మని చెబుతుంది.