`ఏం మాయ చేసావె` టైమ్‌లో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా,ఆ తర్వాత ప్రేమగా మారింది. అయితే మ్యారేజ్‌కి రెండేళ్ల ముందు ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించి 2017 అక్టోబర్ 6,7 తేదీల్లో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం సమంత, నాగచైతన్య గ్రాండ్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. వీరి మ్యారేజ్‌కి ఏకంగా పది కోట్లు ఖర్చు అయినట్టు వార్తలొచ్చాయి. కానీ కరెక్ట్ గా నాలుగేండ్లకే 2021లో అక్టోబర్ 2న ఈ ఇద్దరు విడిపోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అభిమానులకు, ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎవరికి వారు తమ కెరీర్‌లో బిజీగా ఉన్నారు. స్వేచ్చగా సినిమాలు చేసుకుంటున్నారు.