Karthika Deepam: నిరుపమ్, హిమ పెళ్లి ఆపడానికి స్వప్న, శోభ కొత్త ప్లాన్.. సౌందర్యను కోరిక కోరిన శౌర్య!

Published : Jul 14, 2022, 08:04 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 14వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
18
Karthika Deepam: నిరుపమ్, హిమ పెళ్లి ఆపడానికి స్వప్న, శోభ కొత్త ప్లాన్.. సౌందర్యను కోరిక కోరిన శౌర్య!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంబంలోనే హారతి ఇచ్చి శౌర్యను ఇంట్లోకి తీసుకెళ్తారు. ఇక అక్కడ అన్ని ఫోటోలు చూస్తుండగా హిమ శౌర్య కలిసి ఉన్న ఫోటోను చూస్తుంది. ఏంటి ఈ ఫోటో అని ఎంతమంది చెప్పిన వినకుండా ఆ ఫోటో అక్కడ నుంచి తీసి బయటకు ఇసురుతుంది. అప్పుడే అక్కడకు వచ్చిన నిరుపమ్ ఆ ఫోటోను పట్టుకుంటాడు. శౌర్యను నిరుపమ్ తనతో తీసుకెళ్తాడు.
 

28

డాక్టర్ సాబ్ అంటే బావ కూడా అనచ్చు అని తీసుకెళ్తాడు. రవ్వ ఇడ్లి ఉన్న షాప్ దగ్గరకు తీసుకెళ్లి సారీ శౌర్య.. నేను ఏమైనా అని ఉంటే అని సంజాయిషీ చెప్పుకుంటే మీరు ఏం అన్నారు డాక్టర్ సాబ్ మీ మనసులో మాట చెప్పారు.. అంతేకదా అని జ్వాల అంటుంది. అప్పుడు హిమతో ప్రేమ గురించి టాపిక్ తీసుకొస్తే అక్కడ నుంచి వెళ్లిపోవడానికి సిద్ధం అవుతుంది. అగు జ్వాల నేను చెప్పేది వినవా అంటే జరిగేది తెలుసు.. జరగబోయేది తెలుసు.. ఇంకేం చెప్తారు అంటూ జ్వాల అరుస్తుంది.
 

38

నాకు హిమ గురించి ఆ ప్రేమ గురించి చెప్పకండి.. ప్రేమ అంటే హోటల్ లో దొరికే చాయ్, కాఫీ కాదు అని డైలాగ్ వేస్తూ మీరు నాకు ఏమి చెప్పకండి అని వెళ్ళిపోతుంది. ఇక మరో సీన్ లో ప్రేమ్ ను ఆపి స్వప్న మాట్లాడాలి అని కూర్చుంటుంది. అసలు నువ్వు మీ నాన్న ఇంట్లోవారిలా ఫీల్ అవుతున్నారా.. పెళ్లి గురించి అస్సలు పట్టించుకోరు.. నిరుపమ్ పెళ్లి గురించి ఓ ఉహించుకుంటున్నాడు అని చెప్తుంది.
 

48

ఈ పెళ్లి గురించి పెట్టించుకోవాలో.. వద్దో నాకే తెలియడం లేదు అని ప్రేమ్ అంటే హిమ పెళ్లి వద్దు అంటుంది.. వీడు ఏమో తనే కావాలి అంటున్నాడు. నిశ్చితర్థంలో లేచి వెళ్ళిపోయినట్టు పెళ్లిలో లేచి వెళ్ళిపోతే మన పరువుపోతుంది అని స్వప్న అంటుంది. ఆ మాటలు అన్ని విన్న ప్రేమ్.. చూడు మమ్మి.. పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. ఎవరి నిర్ణయాన్ని మనం ప్రశ్నించలేం.. కాదనలేం అని చెప్తాడు.
 

58

ఈ పెళ్లి జరగకపోతే నేను కూడా సంతోషిస్తాను.. అప్పుడు నేను హిమను పెళ్లి చేసుకోవచ్చు అని ప్రేమ్ వెళ్ళిపోతాడు. ఇక స్వప్న మాత్రం నిరూపమ్, హిమాల పెళ్లి ఏం చేస్తే ఆగుతుంది అని అనుకుంటూ ఉంటుంది స్వప్న. మరో సీన్ లో జ్వాలను సౌందర్య రెడీ చేస్తుంది.. ఇది నీకోసం కాదు నాకోసం అని అంటుంది. ఇన్నాళ్లు దూరం అయ్యావు ఇప్పుడు చూసుకుంటున్న అని సౌందర్య చెప్తుంది. మనం ఇష్టపడే వాళ్ళు మన ముందు ఉంటే ఎంత ఆనందమో అని అంటుంది.
 

68

ఇక జ్వాలను తీసుకెళ్లి డాక్టర్ బాబు, వంటలక్కలకు శౌర్యను చూపిస్తుంది. శౌర్యను చీరలో చూసి చాలా అందంగా ఉన్నావురా అని హిమ, ఆనంద్ రావులు అంటారు. శౌర్య మాత్రం హిమాపై కోపంగా చూస్తుంది. మరో సీన్ లో స్వప్న, శోభ ఏంటి ఆంటీ ఇది.. ఏం చెయ్యాలి అని అంటుంది. మనం స్పీడ్ పెంచాలి లేకుంటే నాకు నిరుపమ్ దక్కడు అని అంటుంది. శౌర్య, సౌందర్య నన్ను కొట్టారు వాళ్ళను వదలను అని శోభ అంటుంది.
 

78

ఇక మరో సీన్ లో హిమ, శౌర్య, ఆనంద్ రావు, సౌందర్య భోజనానికి కూర్చుంటారు. నీకు ఏం కావాలో చెప్పు తెచ్చిస్తాను అని సౌందర్య అంటే.. మా నాన్నను తెస్తావా.. మీ డాక్టర్ మనవడు ఇష్టం తెస్తావా అని శౌర్య అడుగుతుంది. ఆ మాటలకు ఏం చెప్పాలో అర్థం అవ్వక సౌందర్య, ఆనంద్ రావులు ఆలోచనలో పడుతారు. ఇక అప్పుడే హిమ అక్కడికే వస్తే భోజనానికి కూర్చో అని సౌందర్య చెప్తే..
 

88

ఇప్పుడు నేను భోజనానికి కూర్చుంటే జ్వాల వెళ్ళిపోతుంది అని మళ్లీ తింటా అని చెప్తుంది. మళ్లీ తినడం ఏంటి ఇప్పుడు రా కూర్చో అని సౌందర్య పిలిచినా వెళ్లిపోతుంటే ఇది నాకు బయపడుతుంది అని మనసులో అనుకోని.. నానమ్మ హిమను భోజనానికి కూర్చోమను అని శౌర్య అంటుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories