ఏంటి పెద్దవాడివైపోయావా.. రెమ్యునరేషన్ తీసుకోమని అడిగితే ప్రభాస్, మోహన్ లాల్ షాకింగ్ రియాక్షన్

Published : Feb 13, 2025, 01:09 PM IST

మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప చిత్రం 140 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతోంది. మొదట ఈ చిత్రాన్ని 100 కోట్ల లోపు పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ బడ్జెట్ అంతకంతకూ పెరిగిపోతోంది.

PREV
14
ఏంటి పెద్దవాడివైపోయావా.. రెమ్యునరేషన్ తీసుకోమని అడిగితే ప్రభాస్, మోహన్ లాల్ షాకింగ్ రియాక్షన్
Mohan Lal and Prabhas

మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప చిత్రం 140 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతోంది. మొదట ఈ చిత్రాన్ని 100 కోట్ల లోపు పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ బడ్జెట్ అంతకంతకూ పెరిగిపోతోంది. మంచు విష్ణు శివభక్తుడు కన్నప్ప పాత్రలో నటిస్తున్నారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

24
prabhas

గతంలో లాంగ్ షెడ్యూల్ ని న్యూజిలాండ్ లో పూర్తి చేసుకుని వచ్చారు. ఈ చిత్రంలో అనేక విశేషాలు ఉన్నాయి. సీనియర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా క్రేజ్ కోసం వీరందరిని నటింపజేశారు. 

34

ఈ చిత్రంలో ప్రభాస్ రుద్ర పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. ప్రభాస్ కి ప్రళయకాల రుద్రుడు అంటూ ఎలివేషన్ ఇచ్చారు. మోహన్ లాల్ కూడా ఒక గెస్ట్ రోల్ లో నటిస్తున్నారు. అయితే వీరిద్దరూ ఈ చిత్రానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు అనే ఆసక్తి అందరిలో ఉంది. 

44

దీని గురించి మంచు విష్ణు తాజాగా స్పందించారు. నేను ప్రభాస్, మోహన్ లాల్ ఇద్దరికీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధం అయ్యాను. కానీ వాళ్లిద్దరూ ఒక్క రూపాయి కూడా వద్దని తిరస్కరించారు. మోహన్ లాల్ అయితే.. ఏంటి అంత పెద్దవాడివి అయిపోయావా అని అడిగారు. వాళ్లిద్దరూ స్నేహానికి విలువ ఇచ్చే అంత గొప్ప నటులు అని మంచు విష్ణు ప్రశంసించారు. 

Read more Photos on
click me!

Recommended Stories