సాగరకన్యగా తెలుగు ఆడియెన్స్ గుండెల్లో నిలిచిపోయిన శిల్పా శెట్టి.. ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాని వివాదం చేసుకుంది. ఆయన రాజస్థాన్ రాయల్ ఐపీఎల్ క్రికెట్ జట్టుకి కో హోనర్‌గా ఉన్నారు. ఇతర పలు వ్యాపారాలున్నాయి. అయితే రెండేళ్ల క్రితం ఆయన నీలిచిత్రాల కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ విషయంలో బాలీవుడ్‌ని షేక్ చేసింది. ఇండియా వైడ్‌గా దుమారం రేపింది. దీనితో శిల్పా శెట్టి సైతం అనేక అవమానాలు ఫేస్ చేసింది. కొన్నాళ్లపాటు బయటకు రావడం మానేసింది. రాజ్‌కుంద్రపై ఆరోపణలు ఈ అందాల భామని బాగా ఇబ్బంది పెట్టాయి.
Raj Kundra
కొన్నాళ్లపాటు జైల్లో ఉన్న రాజ్‌కుంద్ర ఎట్టకేలకు బయటకు వచ్చారు. చాలా రోజులపాటు ఆయన బయటకు రాలేదు. పూర్తిగా ప్రైవేట్ లైఫ్‌కే పరిమితమయ్యారు. ఇటీవల కాలంలో మళ్లీ బయట కనిపిస్తున్నారు. ఎయిర్ పోర్ట్ లో, ముంబయిలు పలు సినీ, వ్యాపార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శిల్పశెట్టితోనూ కలిసి కనిపించారు. అయితే తాజాగా రాజ్‌కుంద్ర ఓపెన్ అయ్యారు. అరెస్ట్ సందర్భాన్ని, జైలుకి వెళ్లిన అనుభవాలను బయటపెట్టారు. ఈ క్రమంలో ఆయన సంచలన విషయాలను వెల్లడించారు.
Raj Kundra
రాజ్‌కుంద్ర జీవితం ఆధారంగా `యూటీ69` పేరుతో ఓసినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో తన జీవితంలోని బ్యాడ్ ఫేజ్‌ని చూపించబోతున్నట్టు తెలుస్తుంది. పాన్ ఇండియా మూవీగా దీన్ని తీసుకురాబోతున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రాజ్ కుంద్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జైలు అనుభవాలను పంచుకున్నారు. జైల్లో తాను చాలా ఇబ్బంది పడ్డట్టు తెలిపారు. జైలుకి తీసుకెళ్లిన ఫస్ట్ డేనే దుస్తులన్నీ విప్పించి అందరి ముందు నగ్నంగా నిలబెట్టారట.
Raj Kundra
తాను ఏదైనా నిషేధిత పదార్ధాలు తీసుకొచ్చావా? అంటూ వంగోబెట్టి వెనుకభాగం చెక్ చేశారని తెలిపారు. తనని అలాంటి ట్రీట్‌మెంట్ చూశాక బతికున్నా చచ్చినట్టే అనే ఫీలింగ్ కలిగిందని, ఇన్నాళ్లు సంపాదించుకున్న పరువు, ప్రతిష్టలు మట్టిలో కలిసిపోయాయని తాను ఎంతో బాధపడినట్టు తెలిపారు రాజ్‌కుంద్ర. జైల్లో తన పరిస్థితిల అలా ఉంటే బయట మీడియా కూడా నా గురించి ఏవేవో తప్పుడు కథనాలు ప్రసారం చేసి, నగ్నంగా నిలబెట్టినంత పనిచేసిందన్నారు.
We have seperated producer Raj Kundra reveals here is truth
ఇలా వరుస అవమానాలతో తాను ఎంతగానో కుంగిపోయినట్టు చెప్పారు. ఒకానొక దశలో జైలులోనే చనిపోవాలనుకుంటున్నానని తెలిపారు. కానీ ఏదో ఒక రోజు అసలు నిజం బయటకు వస్తుందని తనకు తాను ధైర్యం చెప్పుకున్నట్టు చెప్పారు రాజ్‌కుంద్రా. తాజాగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Image: Instagram
ఇదిలా ఉంటే ఇటీవల పెద్ద బాంబ్ పేల్చాడు రాజ్‌కుంద్రా. శిల్పాశెట్టితో విడిపోతున్నట్టు ప్రకటించారు. ఇద్దరం సెపరేట్ అయ్యామని, తమకి ప్రైవసీ ఇవ్వాలని ఆయన ట్వీట్ చేశారు. అది దుమారం రేపుతుంది. అయితే నిజంగానే శిల్పాశెట్టితో విడిపోయారా? అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇక శిల్పాశెట్టి నటిగా ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది.