స్కాన్‌ పేపర్లన్నీ ఉన్నాయి, ఎన్ని బిట్లు ఉంటాయో చెప్పమంటావా? బాలయ్యకే ధమ్కీ ఇచ్చిన శర్వానంద్‌..

Published : Jun 16, 2024, 06:43 PM IST

బాలయ్య ఎంతో మందికి ధమ్కీ ఇచ్చాడు. ఆయన గ్రీసులో ఉంటే ఎవరైనా పక్కకెళ్లి ఆడుకోవాల్సిందే. అలాంటి బాలయ్యకే ధమ్కీ ఇచ్చాడు శర్వానంద్‌.   

PREV
16
స్కాన్‌ పేపర్లన్నీ ఉన్నాయి, ఎన్ని బిట్లు ఉంటాయో చెప్పమంటావా? బాలయ్యకే ధమ్కీ ఇచ్చిన శర్వానంద్‌..

బాలకృష్ణ.. నందమూరి వంశానికి నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్‌ తర్వాత ఆ స్థాయి స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. విలక్షణ నటనతో మెప్పిస్తున్నారు. అయితేఇప్పుడు ఎక్కువగా మాస్‌ యాక్షన్‌ మూవీస్‌తోనే రాణిస్తున్నారు. ఇటీవల హ్యాట్రిక్‌ హిట్‌ అందుకున్నాడు. అటు సినిమాల పరంగా, ఇటు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాడు. ఫుల్‌ జోష్‌లో ఉన్న బాలయ్య ప్రస్తుతం బాబీతో సినిమా చేస్తున్నారు. 

26
Balakrishna

బాలయ్య అంటే అందరికి ధమ్కీ ఇస్తుంటాడు. ఆయనతో పెట్టుకుంటే దబిడి దిబిడే అనేట్టుగా ఉంటుంది. కానీ ఆయనకే ధమ్కీ ఇచ్చాడు యంగ్‌ హీరో. ఆయన ఎవరో కాదు శర్వానంద్‌. ఆధారాలు చెబుతూ అందరి ముందు బాలయ్యకి ధమ్కీ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది.
 

36

శర్వానంద్‌ మాట్లాడుతూ, మీ నాన్న(ఎన్టీఆర్‌) వద్ద మా తాత ఛార్టెడ్‌ అకౌంట్‌(శర్వానంద్‌ తాత). మీ ఆస్తి వివరాలు, మీ ల్యాండ్‌ వివరాలన్నీ మా వద్ద ఉన్నాయి. స్కాన్‌ కాపీలతో సహా మా వద్ద ఉన్నాయి. ఎన్ని బిట్లు, ఎంత ఆస్తులున్నాయో చెప్పమంటావా అంటూ ఝలక్‌ ఇచ్చాడు శర్వానంద్‌. దీంతో దెబ్బకి బాలయ్య సైలెంట్‌ అయిపోయాడు. ఆ బిట్లు కాదంటూ ఏదో అనబోతున్న బాలయ్యకి మరో మాట అనకుండా చేశాడు శర్వానంద్‌.
 

46

బాలయ్య నిర్వహించిన `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే` షోలో ఆ మధ్య శర్వానంద్‌ పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈ టాపిక్‌ వచ్చింది. ఇదిప్పుడు వైరల్‌ అవుతుంది. దీంతో మాస్‌ కా బాప్‌ కే ధమ్కీ ఇస్తున్నక్లాస్‌  హీరో అంటూ, శర్వానంద్‌ మామూలోడు కాదుగా, వామ్మో ఇదెక్కడి మాస్‌ రా మావ అంటూకామెంట్లు చేస్తున్నారు.
 

56

శర్వానంద్‌ ఇటీవల `మనమే`చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చినా, బాక్సాఫీసు వద్ద డీలా పడింది. శర్వాకి మరో ఫ్లాప్ అయినట్టే అని చెప్పొచ్చు.

66

ఇక ప్రస్తుతం బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో `ఎన్బీకే 109` చిత్రంలో నటిస్తున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతుంది. ఎన్నికల నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్‌కి గ్యాప్‌ వచ్చింది. త్వరలోనే ఆయన మళ్లీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories