Bhogi Teaser: భోగి టీజర్ రివ్యూ, శర్వానంద్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్..కెరీర్‌లో తొలిసారి వణుకు పుట్టించేలా

Published : Oct 04, 2026, 03:09 PM IST

శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భోగి టీజర్ విడుదలయింది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ పీరియడ్ డ్రామాపై టీజర్ అంచనాలు పెంచేసింది.

PREV
15
శర్వానంద్

యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన ప్రయత్నాలే చేస్తున్నాడు. వైవిధ్యమైన కథలు చేసినప్పటికీ శర్వానంద్ సినిమాల్లో యువతకు, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అంశాలే ఉంటాయి. కానీ శర్వానంద్ తొలిసారి మాస్ బాట పట్టాడు. శర్వానంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబినషన్ లో తెరకెక్కుతున్న భోగి మూవీ టీజర్ తాజాగా విడుదలయింది.

25
శర్వానంద్ మాస్ మేకోవర్

శర్వానంద్ తన కెరీర్ లో తొలిసారి ఊర మాస్ మేకోవర్ లో కనిపిస్తూ వణుకు పుట్టించే యాక్షన్ సీన్స్ లో నటించాడు. టీజర్ చూస్తూనే ఈ మూవీ బొగ్గుల గుట్ట అనే పల్లెటూరి నేపథ్యంలో రూపొందినట్లు అర్థం అవుతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా డింపుల్ హయతి కీలక పాత్రలో మెరిసింది. టీజర్ లో రక్తపాతం సృష్టించే వయలెన్స్ తో కూడిన సన్నివేశాలు ఉన్నాయి.

35
భోగి సినిమా థీమ్ ఇదే

కుల వివక్ష, పాలెగాళ్ళ ఆధిపత్యం, అణచివేత లాంటి అంశాలతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు టీజర్ చూస్తే అర్థం అవుతోంది. నేను సెయ్య సెయ్యనియ్య అంటూ శర్వానంద్ చెబుతున్న డైలాగ్ మాస్ ఆడియన్స్ ని మెప్పించేలా ఉంది. ఇలాంటి మాస్ గెటప్ లో శర్వానంద్ ఇంతకు ముందెప్పుడూ కనిపించలేదు. విలన్ లకు వార్నింగ్ ఇచ్చే డైలాగులు కూడా చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి.

45
బిగ్ స్క్రీన్ ఎక్సపీరియన్స్

డైరెక్టర్ సంపంత్ నంది రా అండ్ రస్టిక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజువల్స్ చూస్తుంటే ఈ సినిమా మంచి బిగ్ స్క్రీన్ ఎక్సపీరియన్స్ ఇచ్చేలా ఉంది.

55
అంచనాలు పెంచిన భోగి టీజర్

కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. భోగి చిత్రాన్ని నవంబర్ 12న రిలీజ్ చేస్తున్నారు. శర్వానంద్ తన కెరీర్ తో తొలిసారి చేస్తున్న ఈ మాస్ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. టీజర్ మాత్రం సినిమాపై అంచనాలు పెరిగేలా చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories