గ్రాండ్ గా శర్వానంద్ - రక్షిత పెళ్లి వేడుక.. వైరల్ గా మారిన వెడ్డింగ్ ఫొటోలు

First Published | Jun 4, 2023, 2:51 PM IST

టాలీవుడ్ హీరో శర్వానంద్ పెళ్లి రక్షితతో గ్రాండ్ గా జరిగింది. నిన్న రాత్రి మూడుముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటరయ్యారు. వెడ్డింగ్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
 

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ గా ఉన్న శర్వానంద్ (Sharwanand) మొత్తానికి ఓ ఇంటివాడయ్యాడు. రాజస్థాన్ లోని జైపూర్ లో గ్రాండ్ గా శర్వా పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు, అతిథులు, శ్రేయోభిలాషులు హాజరై  నూతన వధూవరులను ఆశీర్వదించారు. 
 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లాయర్ పసునూరి మధుసూదన్ రెడ్డి కూతురు అయిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రక్షిత రెడ్డి (Rakshita Reddy)తో శర్వా వివాహా వేడుక ఘనంగా జరిగింది. రెండ్రోజులుగా వీరి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి రక్షితతో శర్వా ఏడడుగులు వేశారు.
 


పెళ్లి మండపంలో పూజారి మంత్రోచ్ఛరణలతో పెళ్లి కార్యక్రమం హిందూ సంప్రదాయంలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్ గా మారింది. అలాగే రిసెప్షన్ లో గెస్ట్ లతో కలిసి దిగిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 

శర్వానంద్ - రక్షిత పెళ్లి దుస్తుల్లో చూడముచ్చటగా కనిపించారు. పెళ్లికి ముందు హల్దీ ఫంక్షన్ లో ఈ జంట సందడి చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోలు బయటికి వచ్చాయి. అలాగే సంగీత్ పార్టీలోనూ నూతన వధూవరులు డాన్స్ తో ఇరగదీశారు. 
 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) వీరి వివాహ వేడుకకు హాజరై ఆశీర్వదించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా శర్వా- రక్షిత పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెళ్లి దుస్తుల్లో నూతన వధూవరులు ఆకట్టుకుంటున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి Boss Party సాంగ్ కు శర్వా - రక్షిత స్టెప్పులేసి పార్టీలో మరింత జోష్ తెప్పించారు. మొత్తానికి శర్వా  ఓ ఇంటివాడవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లి ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ గా మారుస్తున్నారు. 
 

Latest Videos

click me!