కాబోయే భార్యను పరిచయం చేసిన జబర్దస్త్ కార్తీక్... ఎంత అందంగా ఉందో చూశారా?

Published : Jun 04, 2023, 01:55 PM IST

జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఓ ఇంటివాడు అవుతున్నాడు. ఆయన తనకు కాబోయే భార్యను పరిచయం చేశాడు. ఈ జంట ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

PREV
16
కాబోయే భార్యను పరిచయం చేసిన జబర్దస్త్ కార్తీక్... ఎంత అందంగా ఉందో చూశారా?
Kevvu Karthik


సీనియర్ జబర్దస్త్ కమెడియన్స్ లో కెవ్వు కార్తీక్ ఒకడు. కెవ్వు కార్తీక్ కామెడీలో తనదైన శైలి కలిగి ఉన్నాడు. కెవ్వు కార్తీక్ మిమిక్రీ ఆర్టిస్ట్. పలు షోలలో ప్రదర్శన ఇచ్చాడు జబర్దస్త్ కి వచ్చాక ఆయన ఫేట్ మారిపోయింది. హీరో నాగార్జునను కార్తీక్ గొప్పగా ఇమిటేట్ చేస్తాడు. 

26
Kevvu Karthik

మొదట్లో టీమ్ మెంబర్ గా చేసిన కెవ్వు కార్తీక్ అనంతరం టీం లీడర్ అయ్యాడు. ముక్కు అవినాష్ తో కలిసి ఒక టీమ్ ఏర్పాటు చేశారు. బిగ్ బాస్ ఆఫర్ రావడంతో ముక్కు అవినాష్ జబర్దస్త్ వీడారు. కెవ్వు కార్తీక్ అప్పటి నుండి సోలోగా టీమ్ ని లీడ్ చేస్తున్నాడు.

36
Kevvu Karthik

ఒకప్పటి తన టీమ్ మెట్ అవినాష్ వివాహం చేసుకున్నాడు. తాజాగా కెవ్వు కార్తీక్ సైతం పెళ్ళికి సిద్దమయ్యాడు. రెండు రోజుల క్రితం కార్తీక్ ఒక అమ్మాయితో ఉన్న ఫోటోలు షేర్ చేశాడు. అయితే ఆ అమ్మాయి ముఖం చూపించలేదు. అయితే తాను వివాహం చేసుకోబోయే అమ్మాయి తానె అని హింట్ ఇచ్చాడు.

46
Kevvu Karthik

నేడు ఆ అమ్మాయిని పరిచయం చేశాడు. ఆమె ముఖాన్ని అభిమానులకు పరిచయం చేశాడు. ఓ రొమాంటిక్ కోట్ కూడా షేర్ చేశాడు. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటే ఏమిటో తెలియలేదు. అది ఇప్పుడు అర్థం అవుతుంది. ఫైనల్లీ ఆమె ఈమెనే. నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు. లవ్ యూ సిరి అంటూ రాసుకొచ్చాడు.

56
Kevvu Karthik

కెవ్వు కార్తీక్ కి కాబోయే భార్య చాలా అందంగా ఉంది. నెటిజెన్స్ మీ జంట బాగుందని కామెంట్ చేస్తున్నారు. కెవ్వు కార్తీక్ సందేశం ప్రకారం ఆమె పేరు సిరి. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. 
 

66
Kevvu Karthik

జబర్దస్త్ కి రాక ముందు కెవ్వు కార్తీక్ అనేక కష్టాలు పడ్డాడట. జబర్దస్త్ తనకు జీవితం ఇచ్చిందని కెవ్వు కార్తీక్ పలుమార్లు చెప్పారు. కెవ్వు కార్తీక్ తల్లి ఆరోగ్యం కోసం లక్షలు ఖర్చు చేశాడట. నేను జన్మ ఇస్తే వాడు నాకు పునర్జన్మ ఇచ్చాడని కార్తీక్ తల్లి ఓ షోలో చెప్పారు. 

click me!

Recommended Stories