ఇక బాలయ్య వరుస ప్రశ్నలతో అడివి శేష్, శర్వానంద్ లని ముప్పతిప్పలు పెట్టారు. నేను చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లలో ఎవరు యాక్టింగ్ లో బెస్ట్ అని అడిగారు. దీనితో శర్వానంద్ మహాప్రభో అంటూ బాలయ్యకి దండం పెట్టేశాడు. పెళ్లి ప్రస్తావన రాగానే.. ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోవాల్సిన వారు శర్వానంద్, ప్రభాస్ ఇలా చాలా మంది ఉన్నారు. కాబట్టి నా పెళ్ళికి తొందర లేదు అని అడివి శేష్ చెప్పాడు.