బాలాదిత్య, షాని, సుదీప, వాసంతి, శ్రీసత్య, మెరీనా -రోహిత్, అభినయశ్రీ, కీర్తి, శ్రీహన్ ఇలా 9 మందిని వెనుకాల నిలుచోమని నాగ్ సీరియస్ గా చెబుతారు. ఈవారం ఆట ఏమాత్రం బాగాలేదని అంటారు. తాను ఓడినా పర్వాలేదు.. ఎదుటివాళ్ళు గెలవకూడదు అని అని ఆడిన ఫైమాపై నాగ్ యాంగ్రీ అయ్యారు. చంటి జోకులు బాగా వేస్తున్నాడు కానీ ఇంకా ఆట ఆడడం లేదని అన్నారు. సూర్య బిగ్ బాస్ హౌస్ కి గేమ్ ఆడదానికి వచ్చినట్లు లేదు.. చిల్ కావడానికి వచ్చినట్లు ఉంది అని ఫైర్ అయ్యారు. రేవంత్ జడ్జిమెంట్ చేస్తున్నట్లు కాకుండా తన ఆటపై ఫోకస్ చేయాలని అన్నారు. గీతూ ఆటపై నాగ్ ప్రశంసలు కురిపించారు. తానేంటో ఇంకా చూపిస్తానని గీతూ హామీ ఇచ్చింది.