`హనుమాన్‌` సినిమాలో బాలయ్యకి అవమానం.. ఫ్యాన్స్ అసహనం.. అనవసరంగా గెలికారే..

Published : Jan 13, 2024, 05:53 PM IST

తేజ సజ్జా, ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన `హనుమాన్‌` మూవీపై బాలయ్య ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఆ సీన్‌ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు.   

PREV
17
`హనుమాన్‌` సినిమాలో బాలయ్యకి అవమానం.. ఫ్యాన్స్ అసహనం.. అనవసరంగా గెలికారే..

ప్రశాంత్‌ వర్మ రూపొందించిన `హనుమాన్‌` సినిమా పాజిటివ్‌ టాక్‌తో రన్‌ అవుతుంది. హనుమంతుడి ఎలిమెంట్లు ఈ సినిమాని బాగా కాపాడుతున్నాయి.  కథ పరంగా రొటీన్‌గానే ఉన్నా, హనుమంతుడి పవర్‌, చివర్లో ఆంజనేయుడి ఎలిమెంట్లు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ఈమూవీ పిల్లలకు బాగా నచ్చుతుంది. మొత్తంగా మంచి ఆదరణే పొందుతుంది. 

27

ఇదిలా ఉంటే ఈ మూవీ మేకర్స్ పై బాలయ్య ఫ్యాన్స్ అసహనంతో ఉన్నారు. తమ బాలయ్య బాబుని అవమానించినట్టుగా వాళ్లు ఫీలవుతున్నారు. ఓవర్‌ యాక్షన్‌కి పోయి కించ పరిచేలా చేశారని అంటున్నారు. అత్యుత్సాహం బెడిసి కొట్టిందని అంటున్నారు. మరి ఇంతకి `హనుమాన్‌` సినిమాలో ఉన్న సీన్‌ ఏంటి? అవమానం కలిగించే అంశమేంటి? అనేది చూస్తే.. 
 

37

తేజ సజ్జ హీరోగా నటించిన `హనుమాన్‌` మూవీ శుక్రవారం విడుదలైంది. ఇందులో తేజ సజ్జాలోకి హనుమంతుడి పవర్‌ వస్తుంది. తనకు నదిలో హనుమంతుడి రక్తపు బొట్టు ద్వారా ఏర్పడిన మణి(ఒక రత్నం) దొరుకుతుంది. సూర్య రశ్మి ఉన్నప్పుడు దాని పవర్‌ తేజలోకి వస్తుంది. దీంతో హనుమంతుడికి ఉన్నంత బలం హీరోకి వస్తుంది. అలా విలన్లని చితకబాడుతుంటాడు. 
 

47

అయితే ఆ పవర్‌ గురించి ముందుగా హీరోకి తెలియదు. అల్లరి చిల్లరగా ప్రయోగిస్తుంటాడు. ఈ క్రమంలో గెటప్‌ శ్రీనుతో కలిసి చిన్న ప్రయోగం చేస్తుంటారు. ఓ సీన్‌లో హీరో ఇతర హీరోల డైలాగులు, సీన్లతో రెచ్చిపోతాడు. పవన్‌ కళ్యాణ్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌ సినిమాల సీన్లని వాడుకున్నారు. మరో సందర్భంలో ట్రైన్‌ సీన్‌ని టెస్ట్ చేస్తారు. `పల్నాటి బ్రహ్మనాయుడు` సినిమాలో విలన్ లకు బాలయ్య వార్నింగ్‌ ఇస్తాడు. 
 

57

ఇందులో ఇద్దరి ట్రైన్లు ఎదురుపడతాయి. ముందుకు వెళ్లడానికి లేకుండా అవుతుంది. ఆ సమయంలో విలన్లకి వార్నింగ్‌ ఇస్తూ జై చెన్నకేశవ అని నామస్మరణం చేసి, తొడ గొట్టి విలన్ల ట్రైన్‌ని వెనక్కి పోవాలని ఆదేశిస్తాడు బాలయ్య. దీంతో వాళ్ల ట్రైన్‌ వెనక్కి వెళ్లిపోతుంది. అదే సీన్‌ని `హనుమాన్‌` సినిమాలో స్ఫూఫ్‌ చేశారు. హీరో తేజ సజ్జా పట్టాలపై నిలబడి జై చెన్న కేశవ అని ఆయన తొడకొట్టుకుని మరీ, ట్రైన్‌ని వెనక్కి పోవాలని సైగ చేస్తాడు. కానీ ట్రైన్‌ వెళ్లదు, కదా అతన్ని కొట్టేస్తుంది. అక్కడ తన పవర్స్ పనిచేయలేదు. 

67

దీంతో ఈ సీస్‌ స్ఫూప్‌ చేసి బాలయ్యని అవమానించారని కొంత మంది బాలయ్య ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఇతర హీరోల సీన్లని చేసిన తేజ, బాలయ్య సీన్‌ని చేయలేకపోయాడు. దీంతో ఇది సాధ్యం కాదని, బాలయ్య సినిమాలో ఎలా పెడతారనే అర్థంలో దీన్ని తీసుకుంటున్నారు. దీంతో ట్రోల్స్ చేస్తున్నారు. నెట్టింట రచ్చ చేస్తున్నారు. అయితే అదే సీన్‌ తర్వాత తేజ, గెటప్‌ శ్రీను.. ఎంతైనా బాలయ్య గ్రేట్‌ రా అంటూ వెళ్లిపోతారు. అందులో పాజిటివ్‌ ఉంది, సెటైర్‌ కూడా ఉందని అంటున్నారు. ఇలాంటి సీన్‌ పిల్ల బచ్చా తేజ చేయకుండా ఉండాల్సింది అంటున్నారు. కానీ ఆ సీన్ మాత్రం సినిమాలో ఆడియెన్స్ కి కామెడీని పంచడం విశేషం. 

77

ఇలాంటి సీన్లని చాలా బ్యాలెన్స్ గా చేయాలి. లేదంటే బెడిసి కొడుతుంది. హర్ట్ అయ్యేలా చేస్తుంది. తాజాగా `హనుమాన్‌` విషయంలో బాలయ్య ఫ్యాన్స్ కొంత అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా సోషల్ మీడియా పోస్ట్ ల ద్వారా అర్థమవుతుంది. ఏదేమైనా ఈ మూవీ బాగానే ఆడుతుంది. అయితే టాక్‌ తగ్గ కలెక్షన్లు లేకపోవడం గమనార్హం. స్టార్‌ కాస్టింగ్‌ లేకపోవడమే కారణంగా తెలుస్తుంది. థియేటర్ల సమస్య కూడా మరో కారణంగా నిలుస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories