శంబల.. ఓ మిస్టరీ గ్రామం!
వీకెండ్స్‌లో ఇంట్లోనే కూర్చుని సినిమాలు చూసేవాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీనికి తగ్గట్టే ప్రతి వారం రకరకాల భాషల్లో చాలా సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్, హారర్, ఫాంటసీ, లవ్ స్టోరీలకు ఓటీటీ ప్రేక్షకుల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో, హారర్, మిస్టరీ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఓ సినిమా గురించే ఇప్పుడు మనం చూడబోతున్నాం.
ఆ సినిమా పేరు 'శంబల'. ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ సినిమాను హారర్, ఫాంటసీ, మిస్టరీ జానర్‌లో తెరకెక్కించారు. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన 'శంబల'లో అర్చనా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. స్వాసిక, మధునందన్, రవి వర్మ, రామరాజు, హర్ష వర్ధన్, అన్నపూర్ణ, లక్ష్మణ్ మీసాల, ఇంద్రనీల్ వర్మ, ప్రవీణ్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.