బికినీలో షాకిచ్చిన షాలినీ పాండే.. థండర్‌ థైస్‌ని వేరే యాంగిల్‌లో చూపించి మంట పెట్టిన అర్జున్‌రెడ్డి భామ

First Published | Sep 30, 2023, 2:37 PM IST

విజయ్‌ దేవరకొండ నటించిన `అర్జున్‌రెడ్డి`లో ప్రీతిగా మెస్మరైజ్‌ చేసింది షాలినీ పాండే. ఇప్పుడు సోషల్‌ మీడియాలో మాత్రం ఆటం బాంబ్‌లా పేలింది. అందాలతో షాకిచ్చింది.
 

అర్జున్‌రెడ్డి హీరోయిన్‌ షాలినీ పాండే చాలా సార్లు బికినీలో కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం వేరే లెవల్‌ చూపించింది. ఒంటిపై నీటి చుక్కలు జారుగుతుండగా ఆమె స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద పడుకుని దిగిన ఫోటో మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా ఉంది. బికినీలో మెరిసింది షాలినీ పాండే. అప్పుడే స్విమ్మింగ్‌ పూల్‌ నుంచి వచ్చిన తన చైర్‌పై పడుకుని ఫోన్‌ చూసుకుంటున్న పోజుని కెమెరాలో బంధించి దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. 
 

షాలినీ పాండే బికినీ వేయడం కొత్తేమీ కాదు, కానీ ఆమె ఇచ్చిన పోజు, దిగిన యాంగిల్‌ మాత్రం వేరే లెవల్‌. ఇది ఆటం బాంబ్‌ కంటే ఎక్కువైందని అంటున్నారు నెటిజన్లు. థండర్‌ థైస్‌పై అలా నీటి చుక్కలు జరిపోతుంటే అది చూసిన కుర్రాళ్లు విలవిలలాడిపోతున్నారు. దీంతో ప్రస్తుతం ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుందీ షాలినీ.  
 


Shalini Pandey

షాలినీ పాండే సోషల్‌ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. హీరోయిన్లు ఆఫర్లు కోసం ఇలా సామాజిక మాధ్యమాలను వాడుకుని అందులో అందాల విందు చేస్తూ మేకర్స్ కి వల వేస్తుంటారు. ఇప్పుడు షాలినీ కూడా అదే చేస్తుందనిపిస్తుంది. ఆమెకి సినిమాలు లేవు. అందుకే తనవంతు ప్రయత్నం చేస్తుందీ భామ. 

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన `అర్జున్‌`రెడ్డి చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది షాలినీ పాండే. మధ్య ప్రదేశ్‌కి చెందిన ఈ భామ థియేటర్‌ చేసి వచ్చింది. అందుకే ఈ చిత్రంలో సెటిల్డ్ గా చేసి మెప్పించింది. అటు రౌడీ బాయ్‌ విజయ్‌నే కాదు, ఆడియెన్స్ నికూడా ఫిదా చేసింది. 
 

ఆ తర్వాత ఈ బ్యూటీ `మహానటి`లో చిన్న పాత్రలో మెరిసింది. సావిత్రి స్నేహితురాలు సుశీల పాత్రలో కనిపించింది. అలరించింది. దీంతోపాటు `ఎన్టీఆర్‌`బయోపిక్‌లో షావుకారు జానకీ పాత్రలో మెరిసింది. పాత్రలు చిన్నవే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది షాలినీ పాండే. పాత్రలో జీవించేసింది. 

కళ్యాణ్‌ రామ్‌తో `118` చిత్రంలో మెరిసింది. ఇందులో మేఘా గా సంఘర్షణతో కూడిన పాత్రలో నటించింది. విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత హిందీ, తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో `100% కాదల్‌`, `గొరిల్లా` చిత్రాలు చేసింది. మళ్లీ తెలుగులో `ఇద్దరి లోకం ఒక్కటే` చిత్రంలో మెరిసింది. కానీ సక్సెస్‌ రాలేదు. `నిశబ్దం` కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. 
 

దీంతో హిందీపై ఫోకస్‌ పెట్టింది. అక్కడ `బమ్‌ఫాద్‌`, `జయేష్‌భాయ్‌ జోర్దార్` చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం `మహారాజ` సినిమాలో నటిస్తుంది. హిందీలో అయినా మంచి పేరుతెచ్చుకునేందుకు తనవంతు కృషి చేస్తుందీ భామ. అయితే షాలినీ అందరు హీరోయిన్లలా కాదు, తనది ప్రత్యేకమైన దారి, ప్రత్యేకమైన ఫీచర్‌. అందుకే తక్కువగా వస్తున్నాయనే కామెంట్‌ ఉంది.  

Latest Videos

click me!