BiggBossTelugu7: నాగ్ ముందు ఏడ్చేసిన షకీలా.. బట్టలు విప్పేయమంటున్నారు అని చెబితే, నాన్న ఈజీగా

Published : Sep 03, 2023, 09:11 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ లాంచ్ ప్రారంభమైంది. ఈసారి అంతా ఉల్టా పుల్టా అంటూ నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 7 లో రూల్స్ మొత్తం మారిపోనున్నాయి. 

PREV
17
BiggBossTelugu7: నాగ్ ముందు ఏడ్చేసిన షకీలా.. బట్టలు విప్పేయమంటున్నారు అని చెబితే, నాన్న ఈజీగా

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ లాంచ్ ప్రారంభమైంది. ఈసారి అంతా ఉల్టా పుల్టా అంటూ నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 7 లో రూల్స్ మొత్తం మారిపోనున్నాయి. దీనితో ఈ సీజన్ ఎలా ఉండబోతోందో అని ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగార్జున ఉల్టా పుల్టా అంటూ ఆసక్తి పెంచేస్తున్నారు. 

 

27

హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మరో సర్ప్రైజింగ్ కంటెస్టెంట్ శృంగార తార షకీలా. 80, 90 దశకాల్లో తన శృంగార భరిత మలయాళీ చిత్రాలతో సౌత్ ఇండియన్ సినిమానే షకీలా ఒక ఊపు ఊపింది. ఆమె సినిమా రిలీజ్ అవుతుందంటే కొందరు స్టార్ హీరోలే తమ చిత్రాల్ని వాయిదా వేసుకునేవారు. అంతలా షకీలా ప్రభావం చూపింది. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కొత్త జర్నీ ప్రారంభించింది. 

 

37

తన ఎంట్రీ ముందు లైఫ్ జర్నీ గురించి వివరించింది షకీలా. నా పేరు సి షకీలా జాన్. మా అమ్మది నెల్లూరు, నాన్న చెన్నై. 10 వ తరగతి ఫెయిల్ అయ్యాను. దీనితో నాన్న బాగా కొట్టేవారు. మాకు తెలిసిన మేకప్ మ్యాన్ నన్ను సినిమాల్లోకి రమ్మని ఆహ్వానించారు. దీనితో ఏవిఎం స్టూడియో కి వెళితే సిల్క్ స్మిత సిస్టర్ గా ఒకే చేశారు. 

 

47

అక్కడికి వెళ్లిన తర్వాత బట్టలు విప్పేయమనడం లాంటి సంఘటనలు ఎదురయ్యాయి. ఈ విషయం నాన్నకి చెబితే చేయనని చెప్పు అంటూ ఈజీగా అనేశారు. నేను వాళ్ళకి బంగారు గుడ్డు పెట్టే బాతు మాత్రమే అంటూ తన ఫ్యామిలీ గురించి చెప్పి షకీలా ఎమోషనల్ అయింది. తనని ఫ్యామిలీ ఒక డబ్బు యంత్రంగానే చూశారని షకీలా కన్నీరు పెట్టుకుంది. మా  నేను మలయాళంలో లో హాట్ రోల్స్ చేసినట్లు షకీలా తెలిపింది. 

 

57

నేను సొంతంగా ఇల్లు, ఆస్తులు కొనాలనుకున్నా మా ఫ్యామిలీకి నచ్చదు. ఎందుకంటే రెక్కలు వచ్చిన పక్షిలా వెళ్ళిపోతానేమోనని వాళ్ళ భయం. అందుకే నా డబ్బు మొత్తం దాచి పెడతా అని మా అక్క తీసుకుంది. ఇప్పుడు ఆమె మాత్రమే బాగుంది అంటూ తాను కుటుంబ సభ్యుల నుంచే ఎలా మోసపోయానో షకీలా తెలిపింది. శుక్రవారం రోజు నా సినిమా రిలీజ్ అవుతుంటే.. మిగిలిన వాళ్ళ సినిమా థియేటర్స్ మొత్తం ఖాళి. దీంతో నా పై కుట్ర చేశారు. 

 

67

ఆ కుట్రలో పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు విన్నా. నా సినిమాకి సెన్సార్ కాకుండా అడ్డుకునేవాళ్ళు. నా చిత్రాలని బ్యాన్ చేయాలనీ కూడా డిమాండ్ చేశారు. వాళ్ళకి అంత కష్టం ఎందుకు అని నేనే తప్పుకున్నా. నాలుగేళ్లు సినిమాలు చేయలేదు. ఆ సమయంలో తేజ గారు దేవుడిలా నాకు అవకాశాలు ఇచ్చినట్లు షకీలా తెలిపింది.

 

77

ఇక వేదికపైకి రాగానే షకీలాని నాగార్జున పలకరించారు. షకీలా గురించి అనేక వివరాలు తెలుసుకున్నారు. ఇక షకీలా ట్రాన్స్ జెండర్స్ కి సేవ చేస్తున్న సంగతి తెలిసిందే. తాను సొంత బిడ్డలుగా చూసుకునే ఇద్దరు ట్రాన్స్ జండర్స్ తంగం, షాషా లని నాగార్జున వేదికపైకి పిలిచారు. వాళ్ళని చూడగానే షకీలా కంటతడి పెట్టుకుంది. ట్రాన్స్ జెండర్స్ ని బాగా చూసుకోవాలనేది 20 ఏళ్ల నుంచి నాకు ఈ కోరిక ఉంది అని షకీలా తెలిపింది. అనంతరం షకీలా కి శుభాకాంక్షలు నాగార్జున ఆమెని హౌస్ లోకి పంపారు. 

 

click me!

Recommended Stories